- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిథేన్ అన్వేషణకు సింగరేణికి ఆహ్వానం
బొగ్గు గనుల్లో నిక్షిప్తమై ఉన్న మిథేన్ గ్యాస్ (సీబీఎం) అన్వేషణ దిశగా సింగరేణి సంస్థ అడుగులు వేయనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: బొగ్గు గనుల్లో నిక్షిప్తమై ఉన్న మిథేన్ గ్యాస్ (సీబీఎం) అన్వేషణ దిశగా సింగరేణి సంస్థ అడుగులు వేయనుంది. సింగరేణి పరిధిలోని ప్రాణహిత- గోదావరి లోయ ప్రాంతంలో సుమారు 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించబోయే వేలంలో పాల్గొనాలని సింగరేణి సంస్థను కేంద్రం కోరింది.
శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతితో కేంద్ర పెట్రోలియం శాఖ ఏడీజీ సచివ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సచివ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల్లో మూడు ప్రధాన బ్లాక్‌లను గుర్తించినట్లు తెలిపారు. మంచిర్యాల-పెద్దపల్లి-కొమరం భీమ్ బ్లాక్ (5 బిలియన్ క్యూ.మీ), భద్రాద్రి కొత్తగూడెం బ్లాక్ (2 బిలియన్ క్యూ.మీ), భద్రాద్రి-ములుగు బ్లాక్ (12 బిలియన్ క్యూ.మీ)లలో అన్వేషణకు అవకాశం ఉందన్నారు. 'వికసిత్ భారత్-2047' లక్ష్యంలో భాగంగా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఇది కీలకమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి వెల్లడించారు.






