- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో బంగారం, రాగి అన్వేషణకు సింగరేణికి లైసెన్స్
సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రంలో బంగారం, రాగి అన్వేషణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్వేషణకు సంబంధించిన లైసెన్సు పత్రాలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ కు అందజేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రంలో బంగారం, రాగి అన్వేషణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్వేషణకు సంబంధించిన లైసెన్సు పత్రాలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ కు అందజేశారు. మంగళవారం హైదరాబాద్ లోని టీ హబ్ లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్ నిర్వహించారు. ఈ సమావేశంలో కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ చేయడానికి సింగరేణి సంస్థకు అనుమతుల పత్రాలను అందజేశారు. గత మార్చిలో కేంద్ర గనుల శాఖ నిర్వహించిన కీలక ఖనిజాల వేలం పాటలో సింగరేణి సంస్థ పాల్గొని 37.75 శాతం రాయల్టీతో కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో 199 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ పనిని దక్కించుకుంది.
దీనికి సంబంధించిన లైసెన్సు, సర్టిఫికెట్లను కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఖనిజ రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కృషి చేయాలన్నారు. దేశంలో కీలక ఖనిజ రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.32 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఖనిజాల అన్వేషణకు వేలం పాటలో విజేతలైన వారికి మంత్రి అభినందించారు. అన్వేషణ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ జనరల్ మేనేజర్ (కో-ఆర్డినేషన్), తాడబోయిన శ్రీనివాస్, ఎక్స్ ప్లోరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఆర్ అండ్ డి జనరల్ మేనేజర్ కనకయ్య పాల్గొన్నారు.






