అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణికి ప్రథమ బహుమతి

by Naga Rani Yarlagadda |

జాంబియాలో జరిగిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి రెస్క్యూ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి, భూగర్భ రెస్క్యూ విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది.

అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణికి ప్రథమ బహుమతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాంబియాలో జరిగిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి రెస్క్యూ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి, భూగర్భ రెస్క్యూ విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది. ఏప్రిల్ 30 నుంచి మే 5 వరకు జరిగిన ఈ పోటీల్లో చైనా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అగ్రదేశాల జట్లతో పోటీపడి సింగరేణి విజయకేతనం ఎగురవేసింది. దాదాపు 700 మీటర్ల లోతులో ప్రమాదానికి గురైన వారిని రక్షించే ప్రక్రియను సింగరేణి జట్టు నిర్ణీత 2 గంటల సమయం కంటే ముందుగానే, కేవలం 52 నిమిషాల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది. అలాగే టెక్నీషియన్ టెస్టులోనూ సి.హెచ్. సాయి కృష్ణ వేగంగా విధులు నిర్వర్తించి సత్తా చాటారు. సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి విజేతలను అభినందించారు. ఈ పోటీలకు భారత్ నుంచి డాక్టర్ రాజేశ్వర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం. సింగరేణి రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో శిక్షణ పొందిన ఈ బృందం రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని చాటింది. కాగా... అంతర్జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థ భూగర్భ గనుల రెస్క్యూ విభాగంలో ప్రథమ బహుమతి సాధించడం ఇదే తొలిసారి. కాగా ఈ పోటీల్లో దేశం నుండి కోల్ ఇండియా, సింగరేణితో పాటు పలు కంపెనీలు పాల్గొన్నాయి.

Next Story