దసరా స్పెషల్.. ఉద్యోగులకు బోనస్ ప్రకటన

by Gantepaka Srikanth |

స్వర్ణోత్సవ సంబరాలు, దసరా, దీపావళి పండగను పురస్కరించుకుని.. కోలిండియా లిమిటెడ్ యాజమాన్యం.. తన సబ్సిడరీలు మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని (PLR) ప్రకటించింది.

దసరా స్పెషల్.. ఉద్యోగులకు బోనస్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: స్వర్ణోత్సవ సంబరాలు, దసరా, దీపావళి పండగను పురస్కరించుకుని.. కోలిండియా లిమిటెడ్ యాజమాన్యం.. తన సబ్సిడరీలు మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని (PLR) ప్రకటించింది. కార్మికుల పనితీరుకు, వారి కష్టానికి గుర్తింపుగా.. కోలిండియా, సబ్సిడరీస్‌కు చెందిన 2.09 లక్షల మంది కార్మికులు మరియు సింగరేణికి సంబంధించిన 38 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,03,000 చొప్పున బోనస్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దీన్ని కోలిండియా ఆచరణలో పాటిస్తూ.. కార్మికుల సంక్షేమం పట్ల, వారి పురోగతి పట్ల శ్రద్ధ వహిస్తోంది. నా కార్మిక సోదర, సోదరీమణులకు, మీ కుటుంబసభ్యులకు దుర్గానవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ట్వీట్

Next Story