ఇక నుంచి ఒక్క ప్రాణం కూడా పోకూడదు.. సింగరేణి సీఎండీ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల తొలి అర్థ సంవత్సరంలో అన్ని విభాగాల్లో కొంచెం వెనకబడి ఉన్నామని, ఇప్పుడు వర్షాలు పూర్తిగా తగ్గిపోయినందున ఉత్పత్తిని గణనీయంగా పెంచి లోటును భర్తీ చేసుకొని లక్ష్యాలు సాధించాలని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్. బలరామ్(Singareni CMD Balaram) అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు పిలుపునిచ్చారు.

ఇక నుంచి ఒక్క ప్రాణం కూడా పోకూడదు.. సింగరేణి సీఎండీ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల తొలి అర్థ సంవత్సరంలో అన్ని విభాగాల్లో కొంచెం వెనకబడి ఉన్నామని, ఇప్పుడు వర్షాలు పూర్తిగా తగ్గిపోయినందున ఉత్పత్తిని గణనీయంగా పెంచి లోటును భర్తీ చేసుకొని లక్ష్యాలు సాధించాలని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్. బలరామ్(Singareni CMD Balaram) అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో ఆయన సంస్థ డైరెక్టర్లు, వివిధ కార్పొరేట్ విభాగాల జనరల్ మేనేజర్లతో పాటు అన్ని ఏరియాల్లోని జనరల్ మేనేజర్లతో విడివిడిగా సమావేశమై ఏరియాల వారీగా ఉత్పత్తి, రవాణా వంటి అంశాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ నెలలో సాధించాల్సిన 72 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యానికి గాను రోజుకు రెండు లక్షల నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా సాధించాలని ఆయన పిలుపునిచ్చారు, అలాగే రోజుకు కనీసం 13 లక్షల 75 వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాల్సి ఉంటుందని ఆదేశించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. సింగరేణి సంస్థ వివిధ వ్యాపార విస్తరణ చర్యలు తీసుకున్నప్పటికీ ప్రధాన వ్యాపారం బొగ్గు ఉత్పత్తి కనుక దీని మీద అందరూ శ్రద్ధ పెట్టాలన్నారు. మైనింగ్‌తో పాటు పర్సనల్, రక్షణ, తదితర అధికారులు కూడా ఒక్క ఫైల్ కూడా పెండింగ్‌లో లేకుండా అన్ని పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తుండాలన్నారు. నిబంధనల ప్రకారం ఏ ఏ అధికారికి లేదా ఉద్యోగికి ఏ అవకాశాలు రావాలో అవి వారు పొందే విధంగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సింగరేణి సంస్థను సంపూర్ణంగా ప్రమాదరహిత కంపెనీగా రూపుదిద్దాలని నిర్ణయించుకున్నామని, కానీ గత ఏడాది దురదృష్టవశాత్తు మూడు మరణాలు సంభవించాయని, ఈ ఏడాది ఒక్క మరణం కూడా జరగకుండా ప్రమాదాలను నివారించడానికి అందరు అధికారులు కృషి చేయాలి అన్నారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో తనిఖీలు పెంచాలని సూచించారు.

కొత్త ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్తగూడెం వీకే ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో వచ్చే మార్చి కల్లా కనీసం ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు. అలాగే మిగిలిన కొత్త గనులకు ఇంకా సాధించవలసి ఉన్న అవసరంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ ఏడాది మొత్తం నాలుగు గనులు రంభించుకోవాలన్నారు. ఇప్పటివరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఏరియాల జనరల్ మేనేజర్లతో నెలవారి సమీక్ష కార్యాక్రమాలను నిర్వహించిన చైర్మన్ ఈసారి ప్రత్యక్షంగా అన్ని ఏరియాల జీఎంలను సమావేశానికి రప్పించి సంబంధిత డైరెక్టర్లు, వివిధ కార్పోరేట్ విభాగాల జీఎంల సమక్షంలో సుదీర్ఘంగా, కూలంకషంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాల అవసరాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కే. వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, ఎం. తిరుమల రావు, ఈడి కోల్ మూమెంట్ బి. వెంకన్న, అడ్వైజర్ ఫారెస్ట్రీ మోహన్ పరిగేన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ టి. శ్రీనివాస్ ఇంకా వివిధ కార్పోరేట్ విభాగాల జనరల్ మేనేజర్లుప్రత్యక్షంగానూ మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

Next Story