- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills by Poll: కారును పోలిన గుర్తులు కాంగ్రెస్ వ్యూహమే: హరీశ్ రావు
జూబ్లీహిల్స్ లో స్వతంత్ర అభ్యర్థులకు కారును పోలిన సింబల్స్ పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills bypoll) ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో కారును పోలిన గుర్తులను ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం బీఆర్ఎస్ పార్టీని షాక్‍కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి దింపుడు కళ్ళం ఆశతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టారని ఆ అభ్యర్థులకు కారును పోలిన రోడ్ రోలర్, చపాతీ రోలర్, సబ్బు పెట్టే గుర్తులు ఉన్నాయన్నారు. వృద్ధులను తికమకపెట్టి బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ పార్టీ ఉపాయంతో స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపిందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ స్వతంత్ర అభ్యర్థులకు కారును పోలిన రోడ్ రోలర్, చపాతీ రోలర్, సబ్బు పెట్టే గుర్తులు వచ్చాయని అందువల్ల జూబ్లీహిల్స్ లో వృద్ధులు జాగ్రత్తగా చూసుకుని మూడో నంబర్‍లో ఉన్న కారు గుర్తుకు ఓటేయాలని సూచించారు. బ్యాలెట్‍పై పై నుండి మూడో నెంబర్ బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తు ఉంటే కింది నుండి మూడో సింబల్ రోడ్ రోలర్ గుర్తు ఉందన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం రాదు కానీ తాను ప్రజలకు మోసం చేశానని రేవంత్ రెడ్డికి అర్థం కావాలన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో రజక సంఘం కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు.
రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత బూతులు తప్ప ఏం లేవని ప్రజలు భావిస్తున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే ప్రజలు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదన్నారు. అడ్డమైన మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని ఇప్పుడు ప్రజలు అదే భాషలో తిడుతున్నారన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల గ్యారెంటీ కార్డు ఇచ్చి బాండ్ పేపర్ మీద రాసి 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు.






