పాశమైలారం ప్రమాదంపై సిగాచి యాజమాన్యం స్పందన

by Gantepaka Srikanth |

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారం పేలుడు ఘటన(Pashamylaram Accident)పై సిగాచి యాజమాన్యం(Sigachi Management) స్పందించింది.

పాశమైలారం ప్రమాదంపై సిగాచి యాజమాన్యం స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారం పేలుడు ఘటన(Pashamylaram Accident)పై సిగాచి యాజమాన్యం(Sigachi Management) స్పందించింది. ప్రమాదానికి కారణం బాయిలర్ పేలుడు కాదని నిర్ధారించింది. ప్రమాదం జరిగిన సమయంలో 143 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదంలో 38 మంది మృతిచెందారని స్పష్టం చేసింది. క్షతగాత్రులకు వైద్యం అందుతోందని ప్రతినిధులు చెప్పారు. మరోవైపు మూడ్రోజులు అవుతున్నా తమవాళ్ల జాడ లేదని బాధిత కుటుంబాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం కార్మికుల కుటుంబసభ్యులు పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. గల్లంతయిన తమ వారి ఆచూకీ తెలపాలని బాధితులు డిమాండ్‌ చేశారు. సహాయకచర్యలు వేగంగా జరగడం లేదని ఆరోపించారు. సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టి తమ వారిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. పాశమైలారం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త బి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీలో సభ్యులుగా చీఫ్‌ సైంటిస్ట్‌ టి. ప్రతాప్‌కుమార్‌, విశ్రాంత శాస్త్రవేత్త సూర్యనారాయణ, పుణెకి చెందిన భద్రతాధికారి సంతోష్‌ ఘుగే ఉన్నారు.

Next Story