- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాశమైలారం ఘటన..మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించిన సిగాచీ సంస్థ
పాశమైలారం ఘటన..మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించిన సిగాచీ సంస్థపాశమైలారం సిగాచి పరిశ్రమ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: పాశమైలారం ఘటన..మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించిన సిగాచీ సంస్థపాశమైలారం సిగాచి పరిశ్రమ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మొదటిసారి సిగాచి సంస్థ స్పందించింది. సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో 40 మంది మరణించారని ప్రకటించారు. 33 మంది గాయపడ్డారని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. గాయపడినవారికి పూర్తి వైద్యసాయం అందిస్తామని, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.
ఇదిలా ఉంటే సిగాచి ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కోటి రూపాలయల పరిహారం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. 18 మృతదేహాలను గుర్తించగా.. 16 మృతదేహాలను ఇప్పటికే అప్పగించారు. మరో 11 మంది ఆచూకీ లభించడం లేదని చెబుతున్నారు. ఆ డెడ్ బాడీలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.






