SI Slaps Farmer: యూరియా కోసం వచ్చిన రైతు చెంప చెల్లుమనింపించిన ఎస్ఐ.. హరీస్ రావు ఆగ్రహం

by Prasad Jukanti |   (  Updated:2025-09-01 04:13:22  IST  )

యూరియా కోసం వచ్చిన రైతు ను ఓ ఎస్ఐ కొట్టడం దుమారం రేపుతున్నది.

SI Slaps Farmer: యూరియా కోసం వచ్చిన రైతు చెంప చెల్లుమనింపించిన ఎస్ఐ.. హరీస్ రావు ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో యూరియా కొరత రైతులను కలవరపెడుతోంది. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తాజాగా యూరియా కోసం వచ్చిన రైతు చెంపను ఎస్ఐ చెల్లుమనిపించారు. క్యూలైన్ లో నిలబడి రైతుపై చేయి చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఈ ఘటన జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు. యూరియా అడిగినందుకు రైతు చెంప చెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా రేవంత్ రెడ్డి? అని హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

యుద్ధం వల్ల కాదు సిద్ధంగా లేకపోవడం వల్లే:

ఈ ముఖ్యమంత్రికి తెలిసిన విద్యలు రెండేనని మూటలు మోయడం.. మాటలు మార్చడం అని హరీశ్ రావు విమర్శించారు. యూరియా విషయంలో మొదటి నుంచి ఇప్పటిదాకా ఏం చెప్పారని నిలదీశారు. తొలుత రాష్ట్రంలో యూరియా కొరతే లేదని, ఏఐతో ఫేక్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో రైతుల క్యూలైన్లే లేవన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత.. క్యూలో ఉన్నవాళ్లు రైతులే కాదని బీఆర్ఎస్ కార్యకర్తలే లైన్ లో నిల్చున్నారన్నాని ప్రచారం చేశారని చివరికి యూరియా కొరత నిజమేనని ఒప్పుకున్నప్పటికీ కారణం మాది కాదు కేంద్రంలోని బీజేపీదని, రష్యా ఉక్రెయిన్ వార్ వల్లే ఈ సంక్షోభం అని చెబుతున్నారని విమర్శించారు. యూరియా సంక్షోభం యుద్ధం వల్ల కాదు.. కాంగ్రెస్ సిద్ధంగా లేకపోవడం వల్ల అనే విషయం రైతులకు అర్థమైపోయిందన్నారు. రైతులపై చేయి చేసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా చేయడంలో విఫలమైన ఈ సర్కారు యావత్ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story