Breaking News : యూత్ కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు

by Muthe.Rajitha |

ఇటీవల హైదరాబాద్(Hyderabad) లోని గాంధీభవన్లో(Gandhi Bhavan) యూత్ కాంగ్రెస్ లీడర్లు(Youth Congress Leaders) గొడవ పడిన విషయం తెలిసిందే.

Breaking News : యూత్ కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల హైదరాబాద్(Hyderabad) లోని గాంధీభవన్లో(Gandhi Bhavan) యూత్ కాంగ్రెస్ లీడర్లు(Youth Congress Leaders) గొడవ పడిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు(ShowCause Notice) జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి మాత్రమే పార్టీలో అధిక గౌరవం ఇస్తూ, నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారంటూ కొత్తగూడెం(Kotthagudem)కు చెందిన పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో గొడవకు దిగారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన పలువురు నేతలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురు నేతలకు గాయాలు కాగా.. ఈ గొడవపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గడ్డం రాజశేఖర్, బరగాడి సన్ని, సుధీర్ కుమార్, యాదగిరి ప్రదీప్, గుంపుల రవితేజకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Next Story