- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: ఏయే స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించండి..ఎయిర్ టెల్ కు టీజీఎస్పీడీసీఎల్
కేబుళ్ల తొలగింపుపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అనుమతిలేండా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను తొలగించవచ్చని తెలంగాణ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదంగా మారిన కేబుల్ వైర్ల తొలగింపుపై ఎయిర్ టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అనుమతులు తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని ఎయిర్ టెల్ సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దాంతో ఏయే స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించాలని టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న ధర్మాసనం అనుమతి లేని కేబుళ్లను తొలగించవచ్చని ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. కాగా ఇటీవల రామంతాపూర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్ల వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన కేబుళ్లు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో ఎయిర్ టెల్ హైకోర్టును ఆశ్రయించింది.






