- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్టికల్చర్ అధికారులకు ఆఫీసు ఇవ్వరా...?
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన అధికారులకు నియోజకవర్గం స్దాయిలో కార్యాలయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం

హార్టికల్చర్ అధికారులకు ఆఫీసు ఇవ్వరా...
రాష్ట్ర ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్న సిబ్బంది
153 మంది ఆఫీసర్లకు కష్టంగా విధుల నిర్వహణ
చెట్ట కిందే కూర్చోని దరఖాస్తులు పరిశీలించే పరిస్ధితి
అన్నదాతలు తమను కలిసేందుకు అడ్రస్సు లేదని ఉద్యోగుల ఆవేదన
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన అధికారులకు నియోజకవర్గం స్దాయిలో కార్యాలయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒక మండలంలో రైతు వేదిక కానీ, అగ్రికల్చర్కార్యాలయంలో తమకు ఒక గది కేటాయించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 153 మంది విధులు నిర్వహిస్తున్న వారికి క్షేత్ర కార్యాలయం లేదు. ఒక్కొక్కరు 3 నుండి 10 మండలాలకు అధికారులుగా వ్యవహరిస్తున్నారు. కానీ వీరికి ఏ మండలంలోనూ ఒక్క ఆఫీస్ లేదు. కనీసం ఒక టేబుల్ ఉండదు, ఒక అటెండర్ కూడా ఉండడు, కానీ వీరు ఉద్యోగం చేసిన మండలాల్లోని ఉద్యానవనానికి సంబందించిన ప్రతి ఫైల్ మీద వీరు సంతకం పెట్టాల్సిందే. మరి ఎక్కడ కూర్చుని సంతకం పెడుతారు. రోడ్ మీద, బండ్ల మీద, బస్టాండ్ లోని బళ్లాలను ఆధారం చేసుకొని సంతకాలు పెట్టాల్సిన దుస్థితి. చివరికి జిల్లా ఆఫీసుకీ వెళితే అక్కడ కూడా హార్టికల్చర్ ఆఫీసరుకి కనీసం ఒక టేబుల్ ఉండదు. ఇది క్షేత్ర స్థాయిలో పని చేసే హార్టికల్చర్ ఆఫీసర్ల స్థితిగతి. ఫీల్డ్ లో నానా కష్టాలు పడి, ఎండలకు, వానలకు తిరిగి వచ్చి, కాసేపు కూర్చొని టూర్ డైరీనో, అప్లికేషన్లు, సంతకాల్లాంటి వర్క్ చేసుకోవడానికి జిల్లా ఆఫీసులో అయినా ఒక టేబుల్ ఉండక పోవడం చాలా ఇబ్బందికరమని హార్టికల్చర్అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ డేటా, ఇతర ఉద్యాన పంటల, రైతుల డాటా వివరాలు జాగ్రత్తగా భద్ర పరచడానికి ఒక బీరువా ఉంటే పేపర్స్, ఫైల్స్, ఇతర వస్తువులు జాగ్రత్తగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలా ఆఫీసు, బీరువా లాంటి సౌకర్యాలు లేకపోవడంతో, ఆఫీసర్లు ఉండే అద్దె ఇల్లే ఆఫీస్ ఫైల్స్ కు అడ్రసుగా మారాయి. ఫైల్స్, ఆఫీస్ విషయాలు, పేపర్స్ భద్రపరచడం ఇల్లు సరైంది కాదు. పేపర్స్ మిస్ అయ్యే, మిస్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది.
జిల్లా హార్టి కల్చర్ కార్యాలయంలో టేబులు, బీరువా ఉండాలి :
ప్రతి హార్టికల్చర్ ఆఫీసరుకీ తమ క్షేత్ర కేంద్రాల్లో ఒక ఆఫీస్, ప్రతి జిల్లా హార్టికల్చర్ ఆఫీసులో కనీసం హార్టికల్చర్ ఆఫీసర్ల కోసం ఒక టేబుల్, ఒక బీరువా అయినా ఏర్పాటు చేస్తే బాగుటుందని అధికారులు కోరారు. రైతులు పలు సందర్భాల్లో హార్టికల్చర్ ఆఫీసర్లను కలవడానికి ఫోన్ చేసి తమను ఎక్కడ కలవాలి , మీ ఆఫీస్ ఎక్కడ, అక్కడికి వస్తాం. మీరోచ్చే వరకు మేం మీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తామని, దరఖాస్తు లేదా ఫైల్ మీ టేబుల్ మీద పెట్టి పోమా సార్ అని రైతులు అన్నప్పుడు ఏమి సమాధానం చెప్పాలో కూడా అర్థంకాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చివరికి ప్రతి ఊర్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శికి, వీఆర్వోకు కూడ ఒక రూమ్, టేబుల్, బీరువా ఉంటుంది. వారితో పాటే అగ్రికల్చర్ డిగ్రీ చదివిన అగ్రికల్చర్ ఆఫీసర్లకు ప్రతి మండలంలో ఆఫీసులున్నాయి. అటెండర్లు, సిస్టమ్ ఉంది. వెటర్నరీ డిగ్రీ చదివి ఉద్యోగులైన ప్రతి ఒక్కరికి ఆఫీస్, హాస్పిటల్, అటెండర్లు ఉన్నారు. చివరికి కొన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిస్టమ్ లో పని చేసే ఎ.పి. ఓ, ఎ.పి.ఎమ్, మహిళా శక్తి, ఐకేపి ఇలా ప్రతి శాఖకు ఒక అడ్రస్, ఆఫీస్ ఉంది. కేవలం అడ్రస్ లేని, ఆఫీస్ లేని ఏకైక ఆఫీసర్ హార్టికల్చర్ ఆఫీసర్ మాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
పండ్లు, కూరగాయలు నష్టం జరిగితే అగ్రికల్చర్శాఖదే బాధ్యత :
కూరగాయలు, పండ్లు పండించే రైతులు విత్తనం మొలవక, పురుగు మందులు పనిచేయక నష్ట పోయిన రైతులు కంప్లైంట్ ఇవ్వాలని అగ్రికల్చర్ ఆఫీస్ కి వెళితే అది హార్టికల్చర్ పంట కాబట్టి ఉద్యాన అధికారుల దగ్గరికి వెళ్లాలని పంపిస్తున్నారు. నిజానికి అది హార్టికల్చర్ పంట. కానీ దానిలో వచ్చే ఇబ్బందులను పరిష్కరించే అన్ని అధికారాలు అగ్రికల్చర్ ఆఫీస్ కే ఉన్నాయి. అటు తిరిగి, ఇటు తిరిగి కంప్లైంట్ ఇవ్వడం కోసం హార్టికల్చర్ ఆఫీసర్ కీ ఫోన్ చేస్తే ఏమి చేయగలరు. ఆ కంప్లైంట్ మీద చర్యలు తీసుకోవాల్సిన విత్తన చట్టం అగ్రికల్చర్ ఆఫీసర్ కి మాత్రమే అధికారం ఇచ్చింది. ఇది ప్రభుత్వం పాలసీ, మనం ఏమి చేయలేమని చెప్పాల్సి వస్తుంది. ఈ గందరగోళం మధ్యన రైతు చాలా వేదన, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఆ కూరగాయలు, విత్తన చట్టం హార్టికల్చర్ ఆఫీసర్ చేతులో ఉంటే రైతులకు ఎక్కువగా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రైతు కంప్లైంట్ ఇవ్వగానే అది ఏ కంపెనీ, రిజిస్ట్రేషన్ ఉందా, ఒరిజినల్ విత్తనాలా కాదా, ఆ మందులు ఆ పంట పైన కొట్టొచ్చా, లేదా అనే జాగ్రత్తలు, చర్యలు వాటి మీద సమగ్ర అవగాహన ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ తీసుకోగలడు. అదే విధంగా సమాజానికి ఆరోగ్యకరమైన పంటలను అందించేలా చూడగలరు. కనుక తక్షణమే ప్రభుత్వం వీటి పైన దృష్టి సారించి విత్తన చట్టంలో సవరణలు తెచ్చి ఉద్యానపంటల సంబంధిత విత్తనం, ఎరువుల విషయాల్లో హార్టికల్చర్ ఆఫీసర్లకు అధికారాలు ఇవ్వాలి. మనుషుల మెడికల్ షాప్ లకు ఎలా అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ని ఫార్మసి చదివిన ఉద్యోగులున్నారో, ఫుడ్ టెక్నాలజీ చదివిన వారిని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ గా నియమించారో, అలాగే హార్టికల్చర్ పంటలకు అడ్డగోలుగా పురుగు మందులు చల్లకుండా, పంట చేనులోనే ఫుడ్ పాయిజన్ చేయకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు హార్టికల్చర్ చదివిన వారిని హార్టికల్చర్ ఇన్స్పెక్టర్స్ గా నియమిస్తేనే ఈ సమాజంలో కలుషితం కానీ, పురుగు మందులు లేని వ్యవస్థ తయారు అవుతుంది, రేపటి తరాలు విషతుల్య ఆహారంకి దూరంగా ఉంటుంది. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది.
ఒక మండలం నోడల్ పాయింగ్ గుర్తించి ఆపీసు పెట్టాలి :
హార్టికల్చర్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్న మండల్లాల్లో ఒక మండలాన్ని నోడల్ పాయింట్ గా గుర్తించి, ఒక ఆఫీస్, ఒక కంప్యూటర్ అసిస్టెంట్, స్టాఫ్ ఉండాలి. అలా అయితేనే రైతులకు నిరంతరం నిజమైన సేవలు అందుతాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఎలా అయితే సీడ్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ చట్టంలో అధికారాలు, బాధ్యతలు ఉన్నాయో, హార్టికల్చర్ ఆఫీసర్ లకు హార్టికల్చర్ పంట అన్నింటి పైన అనగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువులపైన పూర్తి స్థాయి అధికారాలు హార్టికల్చర్ ఆఫీసర్ లకు ఇచ్చి తక్షణమే కల్తీలను నిర్మూలన చేపట్టాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ లకు ఎలా అయితే ట్రేజరి నుండి వెహికిల్ అలవెన్స్ ప్రతీ నెల వస్తుందో, అలాగే హార్టికల్చర్ ఆఫీసర్లకు కూడా సంవత్సరం మొత్తం వెహికిల్ అలవెన్స్ ఇవ్వాలి. ఒక మండలంలో పని చేసే ఆఫీసర్లు ఎంపిడిఓ, ఎమ్మార్వోలకు , ట్రావెలింగ్ అలవెన్స్ లు ఇస్తున్నారు. నియోజకవర్గం మొత్తం తిరుగుతూ విధులు నిర్వహిస్తున్న హార్టికల్చర్ ఆఫీసర్లకు కూడా వెహికిల్ అలవెన్స్ అందించాలని కోరారు.






