Esha Singh: ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను కలిసిన షూటర్ ఈషా సింగ్

by Ramesh Naini |

భారత దేశ చరిత్రలో తొలిసారిగా బ్రాంజ్ మెడల్ సాధించి కొత్త రికార్డు సృష్టించిన నిజామాబాద్ బిడ్డ, షూటర్ ఈషా సింగ్‌ను మంత్రి సీతక్క హృదయపూర్వకంగా అభినందించారు.

Esha Singh: ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను కలిసిన షూటర్ ఈషా సింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో భారత దేశ చరిత్రలో తొలిసారిగా బ్రాంజ్ మెడల్ సాధించి కొత్త రికార్డు సృష్టించిన నిజామాబాద్ బిడ్డ, షూటర్ ఈషా సింగ్‌ను మంత్రి సీతక్క హృదయపూర్వకంగా అభినందించారు. మంగళవారం ప్రజాభవన్‌లో నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్, మంత్రి సీతక్కను షూటర్ ఈషా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్‌, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లలో రెండు సిల్వర్ మెడల్స్ సాధించిన ఈషా ప్రదర్శనపై మంత్రి ప్రశంసలు కురిపించారు. 70 దేశాల నుంచి 720 మంది అథ్లెట్లు పాల్గొన్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత పతాకాన్ని ఎగురవేసిన ఈషా ప్రతిభను మంత్రి ప్రశంసిస్తూ, శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించాలని సీతక్క ఆశీర్వదించారు.

Next Story