Gram Sabha List : షాకింగ్..పేరు లేదని గ్రామసభ జాబితాను ఎత్తుకెళ్లిన వ్యక్తి!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-22 12:36:13  IST  )

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ పథకం లబ్ధిదారుల కోసం నిర్వహిస్తున్న గ్రామసభ(Gram Sabha)లు గ్రామాల్లో రచ్చ రేపుతున్నాయి.

Gram Sabha List : షాకింగ్..పేరు లేదని గ్రామసభ జాబితాను ఎత్తుకెళ్లిన వ్యక్తి!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ పథకం లబ్ధిదారుల కోసం నిర్వహిస్తున్న గ్రామసభ(Gram Sabha)లు గ్రామాల్లో రచ్చ రేపుతున్నాయి. అర్హత ఉన్న వారిని కాదని అధికార పార్టీకి చెందిన వారికి, పైరవీ చేసుకున్న వారికి లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పిస్తున్నారంటూ పేర్లు లేని వారు పలుచోట్ల రభస చేస్తున్నారు. తాజాగా ఓ గ్రామ సభ లిస్ట్‌(List)లో తన పేరు లేద(No Name)ని ఓ వ్యక్తి(A Man) ఏకంగా గ్రామసభలో తయారు చేసిన జాబితాను ఎత్తుకుపోయా(He Took It Away)డు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామసభ లిస్టు ఎత్తుకెళ్లింది ఎవరన్నది నిర్ధారించుకోలేక అధికారులు తలలు పట్టుకున్నారు. ఒకవైపు ముందుగా ఎంపిక చేసుకున్న జాబితా పోయిందని అధికారులు టెన్షన్ పడుతుంటే ఇంకోవైపు తమ పేర్లు జాబితాలో లేవంటూ కొందరు, జాబితా గల్లంతు కావడంతో అందులోని తమ పేర్ల పరిస్థితి ఏమిటని మరికొందరు అధికారులను చుట్టుముట్టడంతో వారికి సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకున్నారు.

ఈ నెల 24వరకు దరఖాస్తులు తీసుకుంటామని ఎవరు ఆందోళన చెందవద్దంటూ అధికారులు వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.

Next Story