- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురి కాపురం కూల్చేయాలని క్షుద్రపూజలు..రాష్ట్రంలో షాకింగ్ ఘటన
రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో విడాకుల కోసం క్షుద్రపూజలు చేసిన ఘటన కలకలం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో విడాకుల కోసం క్షుద్రపూజలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... ఖాన్ పేటకు చెందిన ఆశ్రితకు వెంకటాపూర్ కు చెందిన హరిచరణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య ఎలాంటి కలహాలు లేకపోగా కలిసి మెలిసి ఉంటున్నారు. కానీ ఆశ్రిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడంతో కూతురుకు విడాకులు ఇప్పిస్తే అల్లుడి వద్ద నుండి భరణం వస్తుందని పెద్ద స్కెచ్ వేశారు. కానీ విడాకులు ఇచ్చేందుకు కూతురు ఒప్పుకోలేదు. తన భర్తతోనే ఉంటానని తేల్చిచెప్పింది.
ఈ క్రమంలో ఆశ్రిత తల్లిదండ్రులకు ఓ క్షుద్రపూజారి పరిచయం అయ్యాడు. మీ అల్లుడిని కోడలిని నేను విడగొడతా అని మాట ఇచ్చాడు. అంతే కాకుండా చేతులు కాళ్లు పడగొట్టాలా.. లేదంటే ప్రాణం తీసేయాలా అంటూ ఆఫర్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ కూడా బయటకు రాగా వెంకటాపూర్‌లో తెగ వైరల్ అయ్యింది. దీంతో భయపడిపోయిన ఆశ్రిత భర్త హరిచరణ్ తన భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్తామామలతో పాటు క్షుద్రపూజారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక తల్లిదండ్రులే కూతురుకు విడాకులు ఇప్పించాలని కుట్ర చేయడంతో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.






