Jeevan Lal Case : IT కమిషనర్ జీవన్ లాల్ కేసులో షాకింగ్ నిజాలు

by Muthe.Rajitha |

ఇటీవల రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా సీబీఐ(CBI)కి చిక్కిన ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవనలాల్ కేసు(Jeevan Lal Case)లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Jeevan Lal Case : IT కమిషనర్ జీవన్ లాల్ కేసులో షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా సీబీఐ(CBI)కి చిక్కిన ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవనలాల్ కేసు(Jeevan Lal Case)లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇది వరకు కూడా భారీగా లంచాలు(Bribes) వసూలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. తీగ లాగే కొద్ది డొంక కదులుతున్నట్టూ.. జీవన్ లాల్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అందులో ముంబైకి చెందిన NDW డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఏకంగా రూ.2.5 కోట్ల విలువైన ఫ్లాట్ లంచంగా తీసుకున్నట్టు సీబీఐ గుర్తించింది. మరో రెండు సంస్థల నుంచి కూడా రూ.35 లక్షల చొప్పున లంచం తీసుకున్నట్టు తేలింది.

కాగా షాపూర్జీ పల్లొంజి కనస్ట్రక్షన్ సంస్థ టాక్సేషన్ ఫైల్ పెండింగ్ ను క్లియర్ చేసేందుకు రూ.1.20 కోట్లు డిమాండ్ చేయడంతో.. సంస్థ సీబీఐకి సమాచారం అందించింది. రూ. 70 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారుల చేతికి చిక్కాడు. ఈ కేసులో మొత్తం 15 మందిపై సీబీఐ FIR ఫైల్ చేసింది. కాగా జీవన్ లాల్ వసూలు చేసే డబ్బును హవాలా ద్వారా పొందుతున్నట్టు గుర్తించిన సీబీఐ.. హవాలా వ్యాపారులను కూడా గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం.

Next Story