Food Safety: జూబ్లీహిల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో విస్తుపోయే విషయాలు

by Ramesh Naini |

తెలంగాణలో రెస్టారెంట్స్, హోటల్స్, బార్‌లు, కిచెన్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు.

Food Safety: జూబ్లీహిల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో విస్తుపోయే విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెస్టారెంట్స్, హోటల్స్, బార్‌లు, కిచెన్స్‌పై (Commissioner of Food Safety, Telangana) ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో ఓ కిచెన్, బార్‌పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కిష్కింద కిచెన్‌లో దాడులు చేయగా విస్తుపోయే విషయాలు అధికారులు గుర్తించారు. వంటగదిలోని డ్రెయిన్‌లో ఆహార వ్యర్థాలతో మూసుకుపోయినట్లు కనుగొన్నారు. ఆహార పదార్థాలు, ముడి పదార్థాలు నిల్వ చేసినట్లు గుర్తించారు. నిమ్మకాయలు, బంగాళాదుంపలు మొదలైన కూరగాయలు చెడిపోయిన స్థితిలో కనిపించాయి. వంటగదిలో బొద్దింకల బెడద గమనించారు. అనేక చోట్ల ఎలుకల మలం కనిపించినట్లు గుర్తించారు. రియల్ ఫ్రూట్ ఆరెంజ్ జ్యూస్, బటన్ పుట్టగొడుగులు వంటి గడువు ముగిసిన ఆహార పదార్థాలు కనుగొన్నారు.

పోష్ నోష్ అనే బార్‌లో అధికారులు తనిఖీలు చేయగా ఉద్యోగుల వైద్య రికార్డులు, గడువు ముగిసిన లైసెన్స్‌తో పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. రిఫ్రిజిరేటర్లను సరిగ్గా శుభ్రం చేయలేదని గుర్తించారు. వంటగదిలో వెజ్, నాన్-వెజ్ ఆహారం, ఇతర వస్తువులు అన్ని ఒకే చోట కలిపి నిల్వ చేసినట్లు కనుగొన్నారు. గడువు ముగిసిన, తప్పుగా బ్రాండ్ చేయబడిన సిచువాన్ పెప్పర్ గుర్తించారు. సోయా సాస్, పాపడ్ ప్యాకెట్లు, రసం పొడి, ఉల్లిపాయ పొడి, కాజున్ మిక్స్, పుట్టగొడుగు, ప్యాక్ చేయబడిన మెంతి వంటి గడువు ముగిసిన ఆహార పదార్థాలు కనుగొన్నారు. ఈ విషయాలను ఆదివారం ఎక్స్ వేదికగా తెలంగాణ ఫుడ్ స్టేఫీ అధికారులు వెల్లడించారు.

Next Story