TG: మందుబాబులకు BIG షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు..?

by Gantepaka Srikanth |

తెలంగాణ(Telangana)లో మందు బాబులకు మరో భారీ షాక్ తగలబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

TG: మందుబాబులకు BIG షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో మందు బాబులకు మరో భారీ షాక్ తగలబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మద్యం ధరలు(Liquor Prices) పెంచేందుకు ప్రభుత్వం(Telangana Govt) కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోది. ఇప్పటికే బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. చీప్ లిక్కర్ మినహాయించి.. రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో బాటిళ్లపై కనీసం రూ.50 పెరిగే అవకాశం ఉంది. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 30 వేల కోట్లకు పైగా మద్యం పైనా ఆదాయం వచ్చింది.

ఈ ధరల పెంపు ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి దాదాపు రూ.2000 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను దాదాపు 15 శాతం వరకు పెంచింది. దీనివల్ల ఒక్కో బీరుపై సగటున రూ. 20 నుంచి రూ. 30 వరకు ధర పెరిగింది. ఈ ధరలకే మందు బాబులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా మద్యం ధరలు సైతం పెరుగుతాయని వార్తలు వస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు.

Next Story