- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడ ఆలయ ఉద్యోగులకు షాక్.. భారీగా అంతర్గత బదిలీలు
by Kema Shiva Kumar |
పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించి వేములవాడ రాజన్న ఆలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించి వేములవాడ రాజన్న ఆలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఆలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మొత్తం 17 మంది ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఇద్దరు ఏఈవోలు, నలుగురు సూపరింటెండెంట్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒకరు రికార్డ్ అసిస్టెంట్, ఒకరు అటెండర్ ఉన్నారు. అయితే, ప్రసాదం గోదాంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటప్రసాద్ రాజును అంతర్గత బదిలీతోనే సరిపెట్టడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






