మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్.. మరో కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-14 03:06:35  IST  )

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్.. మరో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)‌కు బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)పై నోటికొచ్చినట్లుగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ (Balmuri Venkat) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేటీఆర్‌పై బీఎన్ఎస్ 353(2), 352 సెక్షన్ల కింద తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ మీడియా ఎదుట సీఎం రేవంత్ రెడ్డి పరువు, ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ (Telangana)లో శాంతిభద్రతలను అస్థిరపరిచేలా ఆయన వ్యవహారం ఉందని వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. దీంతో ఆయనపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Next Story