Jubilee Hills: జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్‍‍కు తలసాని షాక్?.. తాజా ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Jubilee Hills: జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్‍‍కు తలసాని షాక్?.. తాజా ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య జూబ్లీహిల్స్ బైపోల్ (Jubilee Hills bypoll) ఫైట్ షురూ అయింది. మరో ఐదు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరికంటే ముందే తమ అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ (BRS) గెలుపు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణినే బరిలోకి దింపడం ద్వారా సెంటిమెంట్ కార్డును ప్లే చేస్తున్న కారు పార్టీకి జూబ్లీహిల్స్ బై పోల్‍లో ఊహించని షాక్ తగలబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) రూపంలో భారీ ఎదురుదెబ్బ తగలబోతోందనే చర్చ ఈ సెగ్మెంట్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నవీన్ యాదవ్ కోసం తలసాని!:

బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నాయి. హస్తం పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నవీన్ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి అల్లుడు. తన సోదరుడు శ్రీనివాస్ యాదవ్ తనకు కుడిభుజం లాంటి వారని తలసాని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్‍ను బరిలోకి దింపితే తలసాని శ్రీనివాస్ యాదవ్ నవీన్ యాదవ్‍కు మద్దతు ఇవ్వబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తలసాని చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరేలా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పార్టీ వర్సెస్ బంధుత్వం:

ఇంటర్వ్యూలో పలు కీలకాంశాలను ప్రస్తావించిన తలసాని.. బీఆర్ఎస్ హయాంలో మాగంటిగోపినాథ్ ఉండగా నవీన్ యాదవ్‍ పడిన ఇబ్బందులు, కేసులు అన్ని తనకు పూసగుచ్చినట్లు తెలుసన్నారు. అయితే తన అల్లుడు నవీన్ యాదవ్‍కు మద్దతు విషయంలో స్పందిస్తూ.. ఇంకా నోటిఫికేషన్ రాలేదని ఆ సందర్భం వచ్చాక మాట్లాడుతానన్నారు. నవీన్ యాదవ్‍ నా కుటుంబీకుడు.. అతనికి నేను చాలా ఏళ్ల నుంచి రాజకీయంగా మార్గనిర్దేశం చేస్తున్నానని తలసని చెప్పుకొచ్చారు. నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉందని అడుగగా ఫ్యామిలీలో డ్రీమ్స్, ఫ్రెండ్స్ సర్కిల్స్ లో డ్రీమ్స్ ఉంటాయి. కానీ తాను సందర్భం వచ్చాక మాట్లాడుతానన్నారు. అలాగే తాను పార్టీకి లాయలిస్టునని చెప్పారు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉంటే పార్టీ ఓ వైపు బంధుత్వం మరో వైపు ఈ రెండింటి మధ్య తలసాని ఎటువైపు అనే చర్చ జూబ్లీహిల్స్ పాలిటిక్స్ లో కాక రేపుతోంది. హైదరాబాద్ లో తలసానికి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నియోజకవర్గం సనత్ నగర్ కూడా జూబ్లీహిల్స్ కు ఆనుకునే ఉంది. ఈ నేపథ్యంలో నేరుగా సపోర్టు చేయకపోయినా అంతర్గతంగా తన అల్లుడికి మద్దతు కూడగట్టే అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తలసాని డిసిషన్ బీఆర్ఎస్‍లో కు కొత్త టెన్షన్ పుట్టించబోతోందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Next Story