- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈ నియామకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‍గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‍లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్ సీపీ వి.సి సజ్జనార్ సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను లోక్ భవన్‌లో శివధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే పోలీస్ శాఖలో వివిధ హోదాలో పని చేసిన అనుభవాన్ని ఉపయోగించుకునేలా గత నెలాఖరున డీజీపీ హోదాలో పదవి విమరణ చేసిన శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కాల పరిమితికి స్టేట్ సెక్యురిటీ అడ్వైజర్‍గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిరోధం, రోడ్డు భద్రత తదితర కీలకమైన పోలీసింగ్ అంశాలపై ప్రభుత్వానికి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
శివధర్ రెడ్డి నియామకం పై హైకోర్టులో పిటిషన్:
ఇదిలా ఉంటే శివధర్ రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం చట్టవిరుద్ధమని, జీవోను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ధన్ గోపాల్ రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. డీజీపీగా శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయడానికి ఒక రోజు ముందు, ఏప్రిల్ 29న జారీ చేసిన జీవో 559 చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీ ర్యాంకులో ఆయనను నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.






