- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vemulawada : శివరాత్రికి ముస్తాబవుతున్న వేములవాడ
శివరాత్రి(Shivarathri) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రధాన శివాలయాలలో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : శివరాత్రి(Shivarathri) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రధాన శివాలయాలలో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఇలవేల్పు వేములవాడ రాజన్న ఆలయం(Vemulawada Rajanna Temple)లో కూడా శివరాత్రి వేడుకకు సర్వం సిద్ధం అవుతోంది. శివరాత్రి నేపథ్యంలో వేములవాడలో ఈనెల 25,26,27 తేదీలలో జాతర(Shivaratri Fest) నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలియ జేశారు. జాతర సందర్భంగా నిర్వహించనున్న పలు కార్యక్రమాలకు గుడి చెరువు వద్దనున్న మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సొంత వాహనాలలో వచ్చే వారు తిప్పాపూర్ వద్ద వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని.. అక్కడి నుంచి ప్రధాన ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇక రాజరాజేశ్వరుని కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టుబట్టలు అందించనుంది దేవాదాయశాఖ.






