మహిళారత్న పురస్కార్ -2025 అందుకున్న శీతల్ చౌహాన్

by Muthe.Rajitha |

ప్రజాసేవ, రహదారి భద్రత, రవాణా నియంత్రణ రంగాల్లో విశేష కృషి చేసిన ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కు చెందిన మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శీతల్ చౌహాన్ కు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొ. వి బాలకిష్టారెడ్డి తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం (టీఐఎఫ్) ప్రతినిధులతో కలిసి అందజేశారు.

మహిళారత్న పురస్కార్ -2025 అందుకున్న శీతల్ చౌహాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాసేవ, రహదారి భద్రత, రవాణా నియంత్రణ రంగాల్లో విశేష కృషి చేసిన ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కు చెందిన మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శీతల్ చౌహాన్ కు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొ. వి బాలకిష్టారెడ్డి తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం (టీఐఎఫ్) ప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఉన్న విద్యామండలి, టీఐఎఫ్ సహాకారంతో శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ..మహిళ సాధికారతకు శీతల్ చౌహాన్ చేసిన సేవలను ప్రశసించారు. మహిళలు ఏ రంగంలోనైనా అగ్ర స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సాహాన్ని అందించాలని, సమాన హక్కులు కల్పించాలని పిలుపునిచ్చారు. మహిళాశక్తిని గౌరవించుకోవడం మనందరి బాద్యత ప్రొ. వి బాలకిష్టారెడ్డి అన్నారు.

ఈ అవార్డు మహిళా సాధికారతకు ఓ మైలురాయిలా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం అవార్డు స్వీకరించిన శీతల్ చౌహాన్ మాట్లాడుతూ... తెలంగాణ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. ఈ గౌరవాన్ని ప్రభుత్వ సేరవలో త్యాగం చేస్తున్న ప్రతి మహిళా అధికారులు, ఉద్యోగినిలకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. యువతులు ధైర్యంగా ముందుకు సాగాలని, సమాజ నిర్మాణంలో తమ పాత్రను గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఐఎఫ్ అధ్యక్షులు, డా. ఎం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మొహ్ద్ అక్తర్ అలీ, డి. జయసుధ, రవితేజ, వి. నాగలక్ష్మి, నౌషీన్ ఫాతిమా, ఉన్నత విద్యామండలి సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Next Story