‘మీరు ఒక మాట చెబితే వారు మాకు సహకరిస్తారు’.. మీనాక్షికి ఫిర్యాదు చేసిన శక్తి అభియాన్ నాయకులు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్​అనుబంధ విభాగం శక్తి అభియాన్‌ను బలోపేతం చేయడానికి జిల్లాల్లో స్థానిక నాయకులు ఎవరూ సహకరించడంలేదని శక్తి అభియాన్ మహిళా నాయకురాళ్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు.

‘మీరు ఒక మాట చెబితే వారు మాకు సహకరిస్తారు’.. మీనాక్షికి ఫిర్యాదు చేసిన శక్తి అభియాన్ నాయకులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​అనుబంధ విభాగం శక్తి అభియాన్‌ను బలోపేతం చేయడానికి జిల్లాల్లో స్థానిక నాయకులు ఎవరూ సహకరించడంలేదని శక్తి అభియాన్ మహిళా నాయకురాళ్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో శక్తి అభియాన్ నాయకులతో మీనాక్షి నటరాజన్​ భేటీ అయ్యారు. శక్తి అభియాన్ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో వారి ద్వారా మీనాక్షీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శక్తి అభియాన్ నాయకులు మాట్లాడుతూ.. తాము శక్తి క్లబ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఒక్కొక్కరు 25 క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. ఒక్కో క్లబ్‌లో ఐదుగురు మహిళలు ఉండాల్సి ఉంటుంది.

అయితే జిల్లాల్లో పర్యటించినప్పుడు స్థానిక నాయకుల నుంచి సహకారం అందడం లేదని తెలిపారు. మహిళా కాంగ్రెస్ ఉంది కదా మళ్లీ మీరు ఎందుకు, మీ కమిటీలు ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతున్నారని, సహకరించడం లేదని మీనాక్షికి తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా స్థానిక నాయకులకు ఒక లిఖిత పూర్వకంగా ఆదేశం ఇస్తే తమకు సహకరిస్తారని తెలిపారు. స్థానికంగా శక్తి అభియాన్ కమిటీలు ఏర్పాటు చేయవచ్చని వారు తెలిపారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది. ఈ సమీక్షలో శక్తి అభియాన్​నాయకురాళ్లు మెర్సి ప్రియాంక, అత్రం సుగుణ, విజయ, ఆస్మ తబ్సుమ్, రమణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story