- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గతంలో సూర్యాపేట, ఇప్పుడు నాగర్ కర్నూల్.. ఎక్కడున్నా ప్రిన్సిపల్ శైలజ తీరింతే
ప్రిన్సిపల్ వేధింపులు ఎక్కువయ్యాయి అంటూ షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. ప్రిన్సిపల్ అరాచకాలకు విద్యార్థులు అందరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్సిపల్ వేధింపులు ఎక్కువయ్యాయి అంటూ షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. ప్రిన్సిపల్ అరాచకాలకు విద్యార్థులు అందరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తమ వద్ద లంచాలు తీసుకుంటూ తమనే బెదిరిస్తోందని మండిపడ్డారు. పెళ్లైన విద్యార్థుల నుండి పరీక్షలు రాయడానికి రూ.10వేలు లంచం తీసుకుందని చెప్పారు. టీసీ తీసుకోవడానికి వస్తే రూ.3వేల నుండి రూ.5వేలు తీసుకుంటుందని అన్నారు.
తమ కాలేజీకి వచ్చే ఆహార పదార్థాలను కూడా ఎత్తుకువెళుతున్నారని చెప్పింది. ప్రిన్సిపల్ తో పాటు మరికొందరు టీచర్లు కూడా తమ కోసం వచ్చే వంట సామాగ్రిని ఇంటికి తీసుకువెళుతున్నారని తెలిపింది. వాళ్లను ఉద్యోగాల నుండి తొలగించాలని, వాళ్లకు ఎక్కడా ఉద్యోగం ఇవ్వవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు హాయిగా ఉంటున్నారని వాళ్ల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. కాలేజీలో అసలు సౌకర్యాలు సరిగ్గా లేవని ప్రిన్సిపల్ ఫుడ్ ఎత్తుకువెళుతుంటూ చూశామని చెబుతున్నారు.
తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రిన్సిపల్ శైలజపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. ఏడాది క్రితం సూర్యాపేట గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు స్కూల్ లోనే మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేయగా తరవాత షాద్ నగర్ పట్టణంలోని గురుకుల కాలేజీకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఇప్పుడు లంచాలు తీసుకుంటూ, అవినీతికి పాల్పడుతుందనే ఆరోపణలతో మరోసారి వివాదాస్పదంగా మారింది.






