- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో విద్యా పాలసీ ప్రగతిశీలంగా ఉండాలి: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యా పాలసీని రూపొందించే నిర్ణయాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) స్వాగతించింది. అయితే, ఈ పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020కి భిన్నంగా, ప్రగతిశీలంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యా పాలసీని రూపొందించే నిర్ణయాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) స్వాగతించింది. అయితే, ఈ పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020కి భిన్నంగా, ప్రగతిశీలంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పాలసీ రూపకల్పనలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్, కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటనలో కోరారు. ఎన్ ఈపీ-2020లో పేర్కొన్నట్లుగా ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయవద్దని ఎస్ఎఫ్ఐ సూచించింది. అంగన్‌వాడీ పాఠశాలలను కలిపి 'ఫౌండేషన్ కోర్సుల' పేరుతో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయకుండా, దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, తగిన నిధులు కేటాయించి, ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.
ఉన్నత విద్యలో మార్పులు:
1వ తరగతి నుండి 12వ తరగతి వరకు సమూల మార్పులు తీసుకువచ్చి, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ కోరింది. అదనపు తరగతి గదులు, కంప్యూటర్ విద్య, హాస్టల్ సౌకర్యాలు మెరుగుపరచాలని, అధ్యాపకులను నియమించాలని సూచించారు. ఉన్నత విద్యలో యూనివర్సిటీలను అభివృద్ధి చేసి, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కోర్సులను రెగ్యులర్ విధానంలోనే నడపాలని విజ్ఞప్తి చేశారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా:
విద్యను ప్రైవేటీకరణ చేయకుండా, ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పించుకోకుండా ఉండాలని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. విద్యను వ్యాపారంగా మార్చడానికి వీలు లేకుండా, అందరికీ విద్య అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. మరిన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్, టెక్నికల్ కళాశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ పాలసీ రూపకల్పనలో ప్రభుత్వం పబ్లిక్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే రాష్ట్ర విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని ఎస్ఎఫ్ఐ అభిప్రాయపడింది.






