- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారంలో లైంగిక దాడి ఆరోపణలు.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్
ములుగు జిల్లాలో జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా 13 ఏళ్ల బాలికపై జరిగినట్లుగా వస్తున్న అత్యాచార వార్తలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లాలో జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (Sammakka-Saarakka Jatara) సందర్భంగా 13 ఏళ్ల బాలికపై జరిగినట్లుగా వస్తున్న అత్యాచార వార్తలపై జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) తీవ్రంగా స్పందించింది. ఈ అమానుష ఘటనపై కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయడమే కాకుండా, వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా (Social Media)లో, ఇతర మాధ్యమాల్లో వస్తున్న కథనాల ప్రకారం.. మేడారం జాతరలో ఒక మైనర్ బాలికపై ఐదుగురు ఛత్తీస్‌గఢ్ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహాత్కర్ (Vijay Rahatkar) తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఈ ప్రత్యేక విచారణ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎం.ఎస్.డెలీనా ఖోంగ్దుప్ సభ్యులుగా కాంచన్ ఖట్టర్ అదేవిధంగా వారికి ములుగు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA)తో నియమించబడిన ఓ న్యాయవాది ఈ కమిటీకి సహకరిస్తారని జాతీయ మహిళా కమిషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అయితే, ఈ కమిటీ ఫిబ్రవరి 5 నుంచి విచారణను ప్రారంభించనుంది. ఘటన జరిగిన పరిస్థితులను పరిశీలించడం, స్థానిక అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించడం, ఇప్పటి వరకు పోలీసులు తీసుకున్న చర్యలను కమిటీ పర్యవేక్షించనుంది. పూర్తిస్థాయి విచారణ అనంతరం రిపోర్టును జాతీయ మహిళా కమిషన్ అదజేయనున్నారు.






