తెలంగాణను చుట్టుముట్టిన తీవ్రమైన చలిగాలులు.. గజ్జున వణుకుతున్న ప్రజలు

by Malleboina Mahesh |

వాతావరణ శాఖ అంచనాలను నిజం చేస్తూ.. చలి తీవ్రతరం అవుతుంది. గత రెండు రోజులుగా తెలంగాణను తీవ్ర చలి గాలులు (Coldwave) చుట్టుముట్టాయి.

తెలంగాణను చుట్టుముట్టిన తీవ్రమైన చలిగాలులు.. గజ్జున వణుకుతున్న ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ అంచనాలను నిజం చేస్తూ.. చలి తీవ్రతరం (Aggravation of cold) అవుతుంది. గత రెండు రోజులుగా తెలంగాణ (Telangana)ను తీవ్ర చలి గాలులు (Coldwave) చుట్టుముట్టాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఈ రోజు ఉదయం కేబీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో కనిష్ఠంగా 7.1 డిగ్రీల సెల్సియస్, త్రియానీలో 8.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రతలుగా వాతావరణశాఖ వెల్లడించింది. ఈ చలి వాతావరణం అటవీ ప్రాంతాలే కాకుండా నగర ప్రాంతాల్లో సైతం తీవ్రంగా మారింది.

హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత పెరిగింది. శేర్ లింగంపల్లి (హెచ్‌సీయూ)లో 11.8°C, రాజేంద్రనగర్‌లో 12.9°C, మారెడ్‌పల్లి‌లో 13.6°C నమోదయ్యాయి. నగర పరిసర ప్రాంతమైన ఇబ్రహీంపట్నంలో ఉదయం 6 గంటలకు 11.5°C నమోదైంది. ఉదయం, రాత్రి వేళల్లో చలి మరింత ఎక్కువగా అనిపిస్తుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. వచ్చే 4–5 రోజుల్లో చలి గాలుల ప్రభావం మరింత పెరగనుంది. ఉత్తర దిశ నుండి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story