రాష్ట్రంలో భారీగా పెరిగిన చలి తీవ్రత

by Malleboina Mahesh |   (  Updated:2025-12-14 17:07:00  IST  )

రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాగల రెండు రోజులు రాష్ట్రంలో భారీగా శీతల గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో భారీగా పెరిగిన చలి తీవ్రత
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాగల రెండు రోజులు రాష్ట్రంలో భారీగా శీతల గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలు చలి తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చలి గాలుల కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయరాదని అధికారులు కోరారు. శీతల గాలుల నేపథ్యంలో ప్రజలు వెచ్చని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 6.2 డిగ్రీ సెల్సియస్ నమోదు

రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. ఇక్కడ రికార్డు స్థాయిలో 6.2 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే హన్మకొండలో 12, రాజేంద్రనగర్ లో 10, పటాన్చెరులో 9, మెదక్ లో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు.

Next Story