మంగళవారం శాసనమండలిలో పలు కీలక చర్చలు

by Muthe.Rajitha |

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.

మంగళవారం శాసనమండలిలో పలు కీలక చర్చలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్యూచర్​సీటిపై ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు లేవనెత్తిన ప్రశ్నకు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ప్రణాళికాబద్ధమైన నగరంగా చండీగఢ్ నిలిచిందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను కూడా అటువంటి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. శంషాబాద్ విమానాశ్రయం, ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) ను కేంద్రంగా చేసుకుని పట్టణీకరణ వేగంగా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా "ఫ్యూచర్ సిటీ" పేరిట ప్రత్యేక నగరాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా ఈ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ఫ్యూచర్ సిటీ పరిధి రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 770 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫ్యూచర్ సిటీని అన్ని సదుపాయాలతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు "ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ"ని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది. పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుందన్నారు.

మూసీ పునరుజ్జీవంపై.. అన్ని పార్టీలు సహకరించాలి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు..

మూసీ పునరుజ్జీవ ప్రాజుక్టుకు సంబందించిన అంశాలపై ఎమ్మెల్సీలు మహేశ్​కుమార్​గౌడ్, జీవన్​రెడ్డి, డాక్టర్​బల్మూరి వెంకట్​లు లెవనెత్తారు. దీనికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు స్పందించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా మూసీ నది రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చురుగ్గా కృషి చేస్తున్నదన్నారు. కాలుష్యాన్ని పరిష్కరించడం ద్వారా నదిని పునరుజ్జీవింప చేయడం, నదీ కారిడార్ వెంబడి పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యమన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సమగ్ర మాస్టర్ ప్లానింగ్ కోసం కన్సల్టెన్సీ సేవలను మెస్సర్స్ కుష్ మన్ అండ్ వెక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ రియోస్ డిజైన్ స్టూడియోస్ ప్రైవేటు లిమిటడ్ కన్సార్టియంలో మెస్సర్స్ మెయిన్హార్డ్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ కు అప్పగించామని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు క్రింది కీలక విధానాలతో దశలవారీగా అమలవుతోందన్నారు. .

కీలక విధానాలు..

*బ్లూ మాస్టర్ ప్లాన్ : నీటి నాణ్యత మెరుగుదల, వరద నివారణ, పర్యావరణ పునరుద్ధరణపై దృష్టి సారించింది.

*గ్రీన్ మాస్టర్ ప్లాన్ : పచ్చదనాన్ని పెంపొందించడం, పౌరులకు వినోద ప్రదేశాలను అభివృద్ధి చేయడం.

*ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్ : ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతంలో సమర్థవంతమైన, స్థిరమైన భూవినియోగాన్ని వ్యూహరచన చేస్తుంది.

*మార్క్యూ ప్రాజెక్ట్స్ : సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మైలురాళ్ళుగా ఉపయోగపడే ఐకానిక్ అభివృద్ధులను గుర్తిస్తుంది.

*మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ : వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ, ఐసిటి నెట్వర్క్ సహా పటిష్టమైన పట్టణ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తుంది.

*ఆర్థికపరమైన మాస్టర్ ప్లాన్ : అధిక సాధ్యా సాధ్యతలు అధ్యయనాలు సృజనాత్మక నిధుల యంత్రాంగాల ద్వారా ప్రాజెక్ట్ సుస్థిరతను నిర్ధారిస్తుంది.

ఇలా కీలక విధానాలతో ప్రాజెక్టు అమలుకు మందుకెళ్తున్నామన్నారు. అయితే, "మూసీ ప్రక్షాళన" జరగకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా... ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగేయదని ఆయన స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు అన్ని పార్టీలు సహకరించాలి. డీపీఆర్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నామన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేసింది. కానీ.. ఏం చేసిందేం లేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పనుల్లో ఎలాంటి జాప్యం లేదు. డీపీఆర్ సిద్ధం అవుతోందన్నారు. మొదటి దశలో బాపుఘాట్ దగ్గర "గాంధీ సరోవర్ ప్రాజెక్ట్" పేరిట పనులు చేపడతామని, ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందని పేర్కొన్నారు. నమో గంగే, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని. కానీ... ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గోదావరి నది నుంచి 2.5 టీఎంసీ నీటిని మూసీ కి తరలించేందుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు.. కానీ.. ఇంతవరకు కేంద్రం స్పందించడం లేదన్నారు. మూసీ ప్రక్షాళన లో ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ రూం ఇస్తామని, ఇప్పటికే 309 మంది కి ఇచ్చాం. ప్రతిపక్షాలు వస్తే ఎక్కడ... ఎవరెవరికి ఇచ్చామో చూపిస్తామని, అలాగే, మూసీ ప్రక్షాళన లో ఉపాధి కోల్పోయే వారికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని, చట్ట ప్రకారం నష్ట పరిహారం అందజేస్తామని, ఎవరికీ అన్యాయం జరగదు అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు తెలిపారు.

తాగునీటి సరఫరాలో సంక్షోభం లేదు.. – సమాధానం ఇచ్చిన మంత్రి సీతక్క

ప్రస్తుతానికి రాష్ట్రంలో తాగునీటి సంక్షోభం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్​రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ప్రశ్నను లెవనెత్తారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. తాగునీటి సరఫరాకు ఏమేరకు నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. దీనికి మంత్రి సీతక్క స్పందించారు. ప్రస్తుతానికి ఎక్కడ తాగునీటి సంక్షోభం లేదని అన్నారు. ఎంబీ ప్రాజెక్టుల నుంచి భారీ స్థాయిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా నీటిని సరఫరా చేసేందుకు భూగర్భ జల వనరులు, బోర్​లను సిద్ధంగా ఉంచామన్నారు. రోజు నీటి సరఫరాకు సంబంధించి పర్యవేక్షిస్తూ ప్రజల నీటి సరఫరాల సమస్యల నమోదు కోసం టోల్​ప్రీ నెంబర్​తో ఫిర్యాదు నమోదు యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇదీ 24గంటలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు. రానున్న వేసవిలో నిరాంతరాయంగా నీటి సరఫరాకు రిజర్వాయర్లు, ఎండీడీఎల్​ను ఐఅండ్​సీడీఏ శాఖతో పర్యవేక్షిస్తున్నామన్నారు. తాగునీటి అవసరాల కోసం 2024 నుంచి 13 పనుల కోసం 298.92 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరంలో 34 భారీ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ, అమలుకు 745.00 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ స్థాయి పథకాల కోసం ఈ వేసవిలో నీటి సరఫరా అవసరాలు తీర్చేందుకు 175.00 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశామని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే, గత పాలకులు తాగునీటి కోసం తీసుకొచ్చిన మిషన్​భగీరత, ఇతరత్ర వంటి అలాగే కొనసాగిస్తున్నామని, ప్రజల నీటి కష్టలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీతక్క తెలిపారు.

పండిట్.. పిఈటీ పోస్టుల అప్​గ్రేడేషన్​పై – ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

పండిట్.. పిఈటీ పోస్టుల అప్​గ్రేడేషన్ వంటి అంశాలపై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్), పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లు (ఫిజికల్ ఎడ్యుకేషన్) స్థాయికి పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ హాస్టళ్ళను ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలుగా అప్​గ్రేడ్​చేశామన్నారు. ఆయా పాఠశాలలు అన్నీ హాస్టళ్ల ప్రాంగనంలోనే కొనసాగిస్తున్నామన్నారు. అలా అప్​గ్రేడ్​అయిన 50 పాఠశాలల్లో ప్రస్తుతం ఐటిడీఏ భద్రాచలం పరిధిలో 13, ఐటిడిఎ ఏటూరునాగారం పరిధిలో 12 ఉన్నాయని తెలిపారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలలో 1085 టీచర్ పోస్టుల మంజూరు కోసం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను సమకూర్చాలనే ఉద్దేశ్యంతో, ఆశ్రమ పాఠశాలలుగా మారిన హాస్టళ్లతోపాటు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలలో తరగతులను నిర్వహించడానికి 339 అకడమిక్ ఇన్​స్ట్రక్టర్లు, 2102 కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లను ప్రభుత్వం అనుమతించిందని మంత్రి సీతక్క వివరించారు.

నగరంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు..

నగరంలో నీటి సరఫరాతోపాటు నీటి తీవ్రత ఉన్నదని సభ్యలు ప్రస్తావించారు. దీనికి హైదరాబాద్​ వాటర్​కు సంబంధించి నీటికి మెట్రోవాటర్​వర్క్స్​వారితో మొత్తంగా రివ్యూ చేస్తామని హైదరాబాద్​ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ట్యాంకర్లకు సిటీలో 24 గంటలకు అనుమతి.. సరఫరాలో ఎక్కడ కూడా ఇబ్బంది కలుగువద్దని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంత సిటీ శివారులలో గ్రౌండ్​వాటర్​ లెవల్స్​పడిపోవడంతో వాటిని కూడా ఎలా అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నీళ్లు సరఫరా కానీ ప్రాంతాలలో వినతి ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్​ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​వివరించారు.

మెట్రో రైలు ఫేజ్–2పై .. ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్​మెట్రోకు సంబంధించి సుచిత్ర ‌‌– కొంపెల్లి, అల్వాల్‌‌–శామీర్​పేట ప్రాంతాలకు విస్తరించాలనని ప్రభుత్వం ప్రతిపాదన ఉన్నదా? ఆయా వివరాలపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. దీనికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు స్పందించారు. మెట్రో రైలు కారిడార్​లు జెబీఎస్​– మేడ్చల్​ 24కిలోమీటర్లు, జేబీఎస్–శామీర్​పేట 21 కిలోమీటర్ల కోసం డీపీఆర్​లు మందస్తు దశలో ఉన్నాయని తెలిపారు. అలాగే, సాధ్యమైనంత త్వరలోనే ఈ ప్రాతపాదనలను మెట్రో ఫేజ్​2 ప్రతిపాదనలుగా కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని మంత్రి తెలిపారు. వృద్ధాప్య ఫించన్ల పథకం అమలుపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ముఖ్యంగా 57 ఏండ్లు దాటిన ప్రతిఒక్క వృద్ధ మహిళలకు 4వేలు ఇస్తామని ఎన్నికల ఎజెండాలో ప్రకటించారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తించారని ఆమె ప్రశ్నించారు. అలాగే, భర్త చనిపోయిన మహిళ ఎవరికైనా ఫించను మంజూరు అయ్యాలా చూడాలన్నారు. దీనికి స్పందించిన మంత్రి సీతక్క ఫించన్ల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ పథకం 2022 సంవత్సరం నుంచి అమలులో ఉన్నదని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం.. ఫించన్​డబ్బులు పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. వితంతు మహిళలకు వెంటనే ఫించన్లు అందజేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

ముస్లింల మైనార్టీలకు సబ్​ప్లాన్​ప్రతిపాదనతోపాటు కుల గణనలో ముస్లిం మైనార్టీల పర్సంటేజీ వాస్తవాలపై ఎమ్మెల్సీ అమేర్​అలీఖాన్​ప్రశ్నించారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఓసీల కింద మైనార్టీలు 2.48 శాతంగా, వెనుకబడిన తరగతుల కింద 10.08 శాతంగా వెల్లడైన మాట వాస్తవమేనని సీతక్క స్పష్టం చేశారు. ముస్లింలకు ప్రత్యేక సబ్​ప్లాన్​ఏర్పాటు చేసి అన్ని విధాలుగా అదుకుంటామన్నారు. అలాగే, రాజీవ్ యువ వికాసం పథకంలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ముస్లింలకు ఇండ్ల విషయంలో న్యాయం చేస్తామని మంత్రి సీతక్క వివరించారు.

క్యాబినెట్ అప్రూవల్​గానే ఆర్ఆర్ఆర్​ – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పై మండలిలో ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ , బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ కి 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్ల రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వెనుకబడిపోయిందన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆర్ఆర్ఆర్​ను పట్టాలెక్కించామని. ఇప్పటికే రీజినల్ రింగ్ ఉత్తర భాగానికి సంబంధించి 7,100 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగిందని పేర్కొన్నారు. దక్షిణ భాగానికి సంబంధించి నితిన్ గడ్కరితో సమావేశమై రిక్వెస్ట్ చేయగా ఆయన దక్షిణ భాగానికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయాలని సూచించారని చెప్పారు. ఇప్పటికే డిపిఆర్ తయారు చేసేందుకు ఏజెన్సీని ఎంపిక చేశామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇప్పటికే ఒక లక్ష కార్ యూనిట్ గా ఉందని, రాబోయే రోజుల్లో మరింత ట్రాఫిక్ పెరిగి జాతీయ రహదారుల పైన ట్రాఫిక్ అంతా నగరంలోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ ట్రాఫిక్ సమస్యకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించడమే పరిష్కారం అని పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల్లో దక్షిణ భాగానికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని గడ్కరి తెలియజేస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ ఏడుసార్లు నితిన్ గడ్కరీని కలిశామని, రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తరాభాగానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ ఇప్పించి పనులు ప్రారంభించేలా చూస్తానని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

క్యాబినెట్ అప్రూవల్ పూర్తికాగానే పిలిచిన టెండర్లు ఓపెన్ చేసి నిర్మాణ సంస్థలు ఎంపిక చేస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం దూరదృష్టితో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ హైదరాబాద్ ను విశ్వ నగరంగా ప్రపంచం ముందు నిలబెట్టిందన్నారు. ఓఆర్ఆర్ఆర్​ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, పివిఆర్ ఎక్స్ప్రెస్ హైవే వంటి ఇన్ఫాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయన్నారు. ప్రభుత్వం ఓఆర్ఆర్ఆర్​నిర్మించి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే.. 300 నుంచి 400 కోట్ల ఆదాయం సంపాదించే ఓఆర్ఆర్ఆర్​ను గత ప్రభుత్వ పెద్దలు 30 ఏళ్లకు అమ్ముకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ.. తాము తెలంగాణ అభివృద్ధి చేయడాన్ని ప్రతిపక్షం స్వాగతించాల్సింది పోయి రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. స్వర్గీయ జైపాల్ రెడ్డి గతంలో ఎంతో దూరదృష్టతో హైదరాబాద్ మెట్రో రైలు మంజూరు చేయించారని గుర్తు చేశారు. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో హైదరాబాదు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. 60 శాతం తెలంగాణను కవర్ చేసే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన్నారు. గత ప్రభుత్వం లాగా తాము రోడ్లను అమ్మడం లేదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రోడ్ల నిర్మిస్తున్నామని తెలిపారు. వాళ్లు కాలేశ్వరం ప్రాజెక్టు కడితే కూలిపోయి కూలేశ్వరం అయిందని దుయ్యబట్టారు. అలాంటి వారే ఇవాళ మూసి ప్రక్షాళన ప్రాజెక్టుకు అడ్డుపడటం బాధాకరమన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మంజూరు చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనే విషయం చైర్మన్ తో సహా సభలో ఉన్న సభ్యులందరికీ. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఒగ్గు కళాకారులపై ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ప్రశ్నను లెవనెత్తారు. కళాకారులకు ఫెడరేషన్​ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా?అని అడిగారు. వృద్ధ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిచేందుకు ఫించన్​ఇవ్వడానికి ఏదైనా ప్రతిపాదన ఉన్నదా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం ఇస్తూ.. వృద్ధ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతిపాదనలు ఏమీ లేవని తెలిపారు. 58ఏళ్ల నిండిన అర్హులైన కళాకారులకు నెలకు 3016 రూపాయలు ఫించన్లు ఇస్తున్నామని తెలియజేశారు.

Next Story