Jagityal: హత్యకేసులో ఏడుగురికి జీవిత ఖైదు

by Naga Rani Yarlagadda |

జగిత్యాల జిల్లాలో 2021లో జరిగిన ఓ హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది.

Jagityal: హత్యకేసులో ఏడుగురికి జీవిత ఖైదు
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలో 2021లో జరిగిన ఓ హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. 2021 జూన్ 15న ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పడాల రాజిరెడ్డిని (Padala Rajireddy Murder Case) ఏడుగురు కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి పూర్తి విచారణ చేపట్టారు.

దర్యాప్తులో నిందితులపై పక్కా ఆధారాలు లభించడంతో, వారిని దోషులుగా నిర్ధారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి శిక్షను ఖరారు చేశారు. ఈ ఏడుగురికి జీవిత ఖైదుతోపాటు ఆరుగురికి రూ.3,500 చొప్పున, మరో వ్యక్తికి రూ.4,000 జరిమానా విధించారు. శిక్ష పొందిన ఏడుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ తీర్పు స్థానికంగా సంచలనంగా మారింది.

Next Story