- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినియోగదారులకు చుక్కెదురు: రెండో సిలిండర్ దరఖాస్తులు బంద్!
తెలంగాణలో గ్యాస్ కొరత కారణంగా రెండో సిలిండర్ దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డబుల్ సిలిండర్ల కోసం వినియోగదారులు డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సింగిల్ సిలిండర్ ఉండటతో ఎప్పడు ఖాళీ అవుతుందోనని భయపడుతూ కొత్త సిలిండర్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత రావడంతో పౌరసరఫరాల శాఖ కొత్త కనెక్షన్ల మంజూరు నిలిపివేసింది. ఉన్న వాటికి సరఫరా చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వంట గ్యాస్ వాణిజ్య అవసరాలకు గుట్టుగా అమ్మకాలు జరగకుండా విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకే చేరేలా కృషి చేస్తోంది. సిలిండర్ ఖాళీ అయితే నెలరోజుల వరకు కొత్తది వచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండో సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి సాధారణంగా వచ్చే దరఖాస్తులు కన్నా ఐదు రెట్లు పెరిగాయి. నిల్వల కొరత సాకుతో వీటిని సైతం ఏజెన్సీలు పెండింగులో పెడుతున్నాయి. నెల రోజులుగా మూడు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు సుమారు 5.50 లక్షల మంది డబుల్ సిలిండర్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు పౌరసరఫరాల పేర్కొంది. ఇప్పడున్న పరిస్థితిలో కనెక్షన్లు ఇవ్వడం సాధ్యంకాదని, యుద్ధ వాతావరణం సద్దుమణిగి గ్యాస్ నిల్వలు అధికంగా ఉన్నప్పుడు ఇవ్వాలనే భావనకు వచ్చింది. రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ కనెక్షన్లున్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 68 లక్షలుంటే డబుల్ సిలిండర్ల కనెక్షన్లు 60 లక్షలు ఉండగా మొత్తం కనెక్షన్లలో 60 శాతం మంది సింగల్ కనెక్షన్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రస్తుతం సిలిండర్ 25 రోజులకు బుకింగ్
గతంలో సిలిండర్ బుక్ చేసిన 15 రోజులకు మరో బుకింగ్ చేసుకోవడానికి వీలుండేది. ప్రస్తుతం కొరత కారణంగా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు వీలు కల్పించారు. బుక్ చేసిన తర్వాత డెలివరీకి మరో వారం నుంచి 11 రోజుల సమయం పడుతోంది. పెద్ద కుటుంబాల్లో సింగిల్ కనెక్షన్ సరిపోక బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఇంట్లోని ఇతర సభ్యుల పేర్ల మీద కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. కొత్తగా విడిపోయిన చిన్న కుటుంబాలు, విద్యార్థులు, వలస కార్మికుల నుంచి దరఖాస్తుల తాకిడి సాధారణం కన్నా రెట్టింపుగా ఉంది. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నెలకు 50 వేల దరఖాస్తులు వస్తుండగా, ప్రస్తుతం నెల రోజుల్లో ఆ సంఖ్య పదింతలు దాటిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ గ్యాస్ పంపిణీ చేస్తోంది. 33 జిల్లాల పరిధిలో 810 ఏజెన్సీలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రోజుకు వంటి గ్యాస్సిలిండర్లు 2.25,981, వాణిజ్య అవసరాలకు 23,458 సిలిండర్లు సరఫరా జరుగుతుంది.
సరఫరా చేయలేమంటున్న డీలర్లు
గ్యాస్ కొరతతో డబుల్ సిలిండర్లు కనెక్షన్లు మంజూరు చేస్తే గ్యాస్‌ను సరఫరా చేయలేమని డీలర్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో సింగిల్ కనెక్షన్లను డబుల్ కనెక్షన్లకు మార్చడం కుదిరే పనికాదని వినియోగదారులకు వివరిస్తున్నారు. ఒక వేళ డబుల్ కనెక్షన్లు ఇవ్వగానే వినియోగదారులు వెంటనే రెండో సిలిండర్ బుక్ చేసుకునే ప్రమాదముందని అనుమానిస్తున్నారు. సిలిండర్‌ను బుక్ చేసినపుడు డెలవరీ చేయటంలో చాలా ఆలస్యమవుతోంది. పాత వారికే సకాలంలో సిలిండర్లను సరఫరా చేయలేకపోతుంటే కొత్తగా వచ్చే వినియోగదారులకు సిలిండర్లను ఎక్కడినుంచి తేవాలని గ్యాస్ డీలర్ల ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగిల్ సిలిండర్ కనెక్షన్లను డబుల్ కనెక్షన్లు చేసి లేనిపోని భారం నెత్తినపెట్టుకోలేమని వెల్లడిస్తున్నారు. ఈ బాధలను ఏగలేకనే డబుల్గ్యాస్కనెక్షన్ల మంజూరు నిలిపేసినట్లు తెలుస్తోంది.






