Hyderabad : అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లోని నాంపల్లి కోర్టు(Nampally Court)లోని పోక్సో స్పెషల్ సెషన్స్ కోర్టు(POCSO Special Sessions Court) సోమవారం ఒక కేసులో సంచలన తీర్పు వెలువరించింది.

Hyderabad : అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లోని నాంపల్లి కోర్టు(Nampally Court)లోని పోక్సో స్పెషల్ సెషన్స్ కోర్టు(POCSO Special Sessions Court) సోమవారం ఒక కేసులో సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన అఖిల్ అనే యువకుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా రూ. 5,000 జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ. 8 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.

2016లో నమోదైన ఈ కేసులో హైదరాబాద్ పాతబస్తీలో అఖిల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసి గర్భవతి చేశాడు. విచారణలో బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిని దోషిగా కోర్టు నిర్దారించి, నేడు ఈ శిక్షను ఖరారు చేసింది.

Next Story