Kurikyala: ‘ఎక్కువ చేస్తే టీసీ ఇచ్చి పంపేస్తా’.. కురిక్యాల లైంగిక వేధింపుల ఘటనలో సంచలన విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2025-10-28 08:28:31  IST  )

కురిక్యాల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Kurikyala: ‘ఎక్కువ చేస్తే టీసీ ఇచ్చి పంపేస్తా’.. కురిక్యాల లైంగిక వేధింపుల ఘటనలో సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు అటెండర్ యాకూబ్ పాషా (Yakoob pasha) లైంగిక వేధింపుల ఘటనలో (Kurikyala school sexual harassment case) సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ వ్యవహారం అంతటిలో పాఠశాల హెడ్ మాస్టర్ కమల (headmaster Kamala) తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలవరం రేపుతున్నాయి. యాకూబ్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని గతంలోనే హెడ్ మాస్టర్ కు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా వాటిని పట్టించుకోక పోగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే టీసీ ఇచ్చి పంపేస్తానని పదో తరగతిలో ఉన్న మీ భవిష్యత్ ఏంటో ఆలోచించుకోవాలని కమల బెదిరించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీసీ ఇస్తే తమ భవిష్యత్ ఏమవుతుందో అనే ఆందోళనతో తమ పిల్లలు ఈ విషయాలను ఇన్నాళ్లు తమతో కూడా చెప్పలేదని, ఇన్నాళ్లు లోలోపలే కుమిలిపోయిన తమ పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఈ విషయాన్ని మాతో చెబుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెడ్ మాస్టర్ అండదండలతోనే అడెంటర్ ఈ దారుణాలకు పాల్పడ్డారని అడెండర్‍కు ఎందుకు ఆమె సపోర్టు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం మీ దృష్టికి వచ్చినప్పుడే చర్యలు తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని నిలదీస్తున్నారు. చర్యలు తీసుకోకపోగా తమ పిల్లలపైనే లేని పోని మాటలు అని మానసికంగా ఇబ్బంది పెట్టిందని మీ పిల్లలు ఒకటి మా పిల్లలు ఒక్కటా అంటూ ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. బాధితులందరిపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

స్కూల్ విద్యార్థినులతో అడెంటర్ యాకూబ్ పాషా తరచూ అనవసరంగా మాట్లాడడం, వారు బాత్రూంల వైపు వెళ్తున్నప్పుడు మొబైల్‍లో ఫొటోలు తీయడంతో పాటు రహస్యంగా కెమెరాలు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకం రేపుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సైతం సీరియస్ అయింది. ఇప్పటికే హెడ్ మాస్టర్ కమల, అడెంటర్ యాకూబ్ పాషాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిదింతుడు యాకూబ్ పాషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు.

Next Story