- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్ అక్రమ సరోగసీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
హైదరాబాద్‌లో కొడుకు, కూతురితో కలిసి మాదాపూర్, అమీర్‌పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఏర్పరచుకుని అక్రమ సరోగసి దందాకు తెరతీసినట్లుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ సరోగసీ కేసులో (Medical surrogacy case) సంచలన నిజాలు వెలుగులో వచ్చాయి. కేసులో ప్రధాన నిందితురాలైన చిలకలూరిపేటకి చెందిన లక్ష్మీరెడ్డి 2024లో ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో (Human trafficking case) అరెస్టు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే, హైదరాబాద్‌లో కొడుకు, కూతురితో కలిసి మాదాపూర్, అమీర్‌పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఏర్పరచుకుని అక్రమ సరోగసి దందాకు తెరతీసినట్లుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలను టార్గెట్‌గా చేసుకుని మూడుసార్లు అండాలు ఇస్తే రూ.30 వేలు ఇస్తానని, సరోగసీ ద్వారా పిల్లలను కనిస్తే రూ.4 లక్షలు ఇస్తానని వారికి ఆశచూపించేది. నిందితురాలు లక్ష్మీ డైరీలో సరోగసీకి సంబంధించిన వివరాలు, 50 మందికి పైగా మహిళలకు సరోగసి చేయించిన సమాచారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె గతంలో ఏజెంట్‌గా, సరోగెంట్‌గా కూడా పనిచేసినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు IVF సెంటర్ల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.






