డిప్యూటీ CM నేతృత్వంలో కీలక సమావేశం.. తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-08 05:55:26  IST  )

తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నేతృత్వంలో ప్రజాభవన్ వేదికగా జరిగే సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించింది.

డిప్యూటీ CM నేతృత్వంలో కీలక సమావేశం.. తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నేతృత్వంలో ప్రజాభవన్ వేదికగా జరిగే సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ ద్వారా తెలియజేశారు. ‘ఆహ్వానం ఆలస్యంగా అందింది. ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం లేదు. పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే కాస్త ముందుగా తెలియజేయాలని కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇకముందూ చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటుంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్‌ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి భేటీకి ఆహ్వానించారు.

Next Story