ఎమ్మెల్యేలంతా రూ.25 వేలు ఇవ్వాల్సిందే.. CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |
ఎమ్మెల్యేలంతా రూ.25 వేలు ఇవ్వాల్సిందే.. CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నోవోటెల్‌ వేదికగా జరుగుతోన్న CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అభివృద్ధికి ప్రతీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) జీతం నుండి రూ.25 వేలు ఇవ్వాలని సీఎల్పీ(CLP) నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎమ్మెల్యేలంతా జనాల్లో ఉండాలని.. విస్తృతంగా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. అంతేకాదు.. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడకూడదని.. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని అన్నారు. భయపడే పరిస్థితిలో పార్టీ లేదని చెప్పారు. అద్దంకి దయాకర్‌లాగా అందరూ ఓపికతో ఉండాలని.. దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మంత్రివర్గ విస్తరణ అంశం హైకమాండ్ చూసుకుంటుందని.. దీని గురించి ఎవరూ బహిరంగంగా బయట మాట్లాడొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ చేశారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంపై నేతలు చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సలహాలను ఈ భేటీలో తీసుకున్నారు. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి జపాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు.



Next Story

Most Viewed