- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం: తల్లిదండ్రులను చూడని ఉద్యోగుల వేతనంలో కోత విధిస్తూ కొత్త చట్టం
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతంలో 15% కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. వయోవృద్ధుల రక్షణే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర శాసన సభలో తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీ తన వంటి అంశాలపై రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ప్రవేశ పెట్టారు. తల్లిదండ్రులు యోగ క్షేమాలు చూడడంతో పాటు వారికి సేవలు అందించడం పిల్లల బాధ్యత. ప్రాథమిక కర్తవ్యం. ఉద్యోగులు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగులలో నైతిక బాధ్యత పెంపొందించేందుకు నూతన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో పలు అంశాలను ప్రభుత్వం పొందుపరిచింది. ఉద్యోగి జీతం నుంచి అతనిపై ఆధారపడిన తల్లిదండ్రులకు నెలవారి వేతనంలో 15 శాతం కానీ, రూ. 10 వేలు, రెండింటిలో ఏది తక్కువ అయితే దాని చెల్లించాలి. ప్రాథమిక అవసరాలైన ఆహారం, ఆశ్రయం,దుస్తులు, వైద్య చికిత్స వంటి అవసరాలకు వినియోగించే వీలుంటుందని తెలిపింది.
ప్రభుత్వంచే నియమించబడిన సర్కార్నియంత్రణ కింద ఉన్న, ప్రభుత్వ ఖజానా ద్వారా రాష్ట్ర సంచిత నిధి నుంచి జీతం పొందుతున్న వ్యక్తి అయి ఉండాలి. హైదరాబాద్మహానగర పురపాలక కార్పొరేషన్చట్టం, స్ధానిక సంస్దలో ఎన్నికైన, నామినేటెడ్సభ్యులు, ఉద్యోగులు. ప్రతి ఉద్యోగి వారి మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ, పోషణకు బాధ్యత వహించాలి. ఈవిషయంలో నిర్లక్ష్యం, చట్ట అతిక్రమణ చేస్తే చట్ట నిబంధనలు అనుసరించి చర్యలు ఉంటాయని తెలిపింది. ఈ చట్టం ప్రారంభమైన తేదీ నుంచి ఆరు నెలల గడువు తీరిన తర్వాత ఉద్యోగుల ఆయా కేటగిరీలకు వర్తించ దగ్గ ప్రవర్తన నియామళిని సవరణ చేసినట్లుగా భావించాలి. ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులతో ఒకరు కానీ ఇద్దరు ఉద్యోగి నెలసరి జీతంలో కేటాయింపును కోరుతూ నియమించిన బడిన అధికారి సమక్షంలో నిర్ణయించినట్టి రీతిలో ఒక వ్రాతపూర్వకమైన దరఖాస్తు సమర్పించవచ్చును.
ఉద్యోగి జీతం నుంచి నియామకపు అధికారి కేటాయింపు చేసిన మొత్తం నెలసరి ప్రాతిపదికపై నేరుగా చెల్లించాలి. ఆదారపడిన తల్లిదండ్రులు తమ జీవనం హుందాగా గడుపుటకు వారికి సరిపడినంత ఆదాయ వనరులు ఏమి లేవని, వారికి ఉద్యోగి నుంచి ఆర్థిక మద్దతు అవసరమని విచారణ చేయకుండానే నిరూపించాలి. చట్టంలోని 6వ సెక్షన్‌కింద వచ్చిన దరఖాస్తులను న్యాయ నిర్ణయం చేయుటకు, నిర్దారణ కోసం ప్రతి జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వం, అధికార ప్రకటన ద్వారా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్‌ను నియమించాలి. ఆధారపడిన తల్లిదండ్రుల నుంచి దరఖాస్తు అందిన వెంటనే నియమించబడిన అధికారి సంబంధిత దరఖాస్తుదారు, ఉద్యోగి ఇద్దరికి విన్నవించుకొనుటకు సరైన అవకాశం ఇచ్చిన తర్వాత నిర్ణయించిన విధంగా పరిశీలన, క్లైయిమ్అర్హతను నిర్ధారణ చేసి దరఖాస్తు అందిన తేదీ నుంచి 60 రోజుల గడువు లోపల దరఖాస్తు పరిష్కరించాలి.
అప్పీలు చేసుకునే హక్కు, వయోవృద్ధుల కమిషన్ పరిష్కరిస్తుంది
నియమించబడిన అధికార జారీ ఉత్తర్వులతో బాదితులు ఆ ఉత్తర్వులను అందిన తేదీ నుంచి 45 రోజుల వ్యవధి లోపల వయోవృద్ధుల కమషన్సమక్షంలో అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. కమిషన్అప్పీలును విచారణ జరిపిన తరువాత ఆ అప్పీలు సరైనదని భావించినప్పుడు కమిషన్ ఆదారపడిన తల్లిదండ్రులకు ఉద్యోగి జీతం నుంచి కేటాయించిన భాగం మంజూరు చేయాలి. ఉత్వర్వుల తేదీ తర్వాత వచ్చే నెల నుంచి బ్యాంకు ఖాతాకు నేరుగా నెలసరి ప్రాతిపదికపై చెల్లించాలని నిర్ధారిస్తూ సంబంధిత నియామక అధికారి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి.
వయో వృద్దుల కమీషన్ఏర్పాటు నిబంధనలు, కర్తవ్యం
రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో అదికారిక ప్రకటన ద్వారా మూడు నెలల వ్యవధిలో అధికారిక ప్రకటనలో నిర్దిష్టమైన తేదీ నుంచి ఈ చట్టం కింద తనకు ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకొనుటకు, కర్తవ్యం నిర్వహించుటకు వయోవృద్ధుల కమిషన్ఒక సంస్థ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్లో ప్రధాన కమిషనర్, అవసరమైతే ఇద్దరికి మించిని కమీషనర్లు ఉంటారు. సబ్‌సెక్షన్5,6లో నిర్ధిష్టమైన అర్హతలు, అనుభవం కలిగిన వ్యక్తులను ప్రధాన కమిషనర్, కమిషనర్‌ను నియమించాలి. కమిషన్ వ్యవహారాలు సాధారణ పర్యవేక్షణ,ఆదేశం,నిర్వహణను ప్రధాన కమిషనర్ కలిగి ఉంటారు. అతను కమీషనర్ల సహాయం పొందాలి. ఉన్నత న్యాయస్థానం లో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తులలో నుండి వయోవృద్ధుల కమిషన్కార్యాలయంలో కమీషనర్‌గా పనిచేసిన వ్యక్తిగా ప్రధాన కమిషనర్‌గా నియమించాలి.
ఆయన చేరిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతాడు. అతని తీరు బట్టి మరో విడత తిరిగి నియమించవచ్చును. అదే విధంగా కమిషనర్ ప్రధాన కమిషనర్‌గా నియమించబడితే పదవి కాలం ప్రధాన కమిషనర్‌గా మొత్తం 5 సంవత్సరాలు మించరాదు. 65 సంవత్సరాల వయస్సు దాటరాదు. వారికి బలమైన అదికారాలు ప్రభుత్వం కట్టబెట్టింది. వ్యక్తులకు సమన్చేయుట, హాజరగునట్లు , ప్రమాణంపై మౌలిక, రాతపూర్వకమైన సాక్ష్యం ఇవ్వాలని, దస్తావేజులను, ఇతర ముఖ్యమైన వస్తువులను సమర్పించాలని కోరాలి. ఆపిడవిట్లపై సాక్ష్యాలను స్వీకరించాలి.
రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ
ప్రభుత్వం అధికారిక ప్రకటన ద్వారా జబ్బు పడిన, వయసు పైబడిన ఆధారపడిన తల్లిదండ్రులకు ఇబ్బందులను తగ్గించడానికి వీలుగా ఈ చట్టం నిబంధనలు అమలును తరుచుగా పర్యవేక్షించుటకు నిర్ణయించబడిన సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ సంస్ధను ఏర్పాటు చేయాలి. ఆ సంస్ధ ఉద్యోగులలో కనీస నైతికతను, కుటుంబ విలువలను పెంపొందించుటకు చట్టం ప్రభావాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నించాలి. ఈ చట్టం నిబంధనలు అమలు జరపడంలో ఇబ్బందులు కలిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉత్వరువుల ద్వారా ఈ చట్టం నిబంధనలు, దాని కింద చేసిన నియమాలు విరుద్దంగా లేని ఆ ఇబ్బందిని తొలగించుటకు అవసరమని, ఉపయోగకరమని తమకు తోచిన నిబంధనలు చేయవచ్చును. ఈ చట్టం కింద చేసిన ఏదైనా ఉత్తరువు విషయంలో ఏదైనా దావా, దరఖాస్తు, ఇతర ప్రొసీడింగులను ఏ న్యాయస్థానం స్వీకరించరాదు. చట్టం కింద అప్పీలు ద్వారా కాకుండా ఇతర విధాలుగా ఆ ఉత్తర్వులను ప్రశ్నించరాదు.
ఈ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్ని నియమాలను వాటిని చేసిన వెంటనే అప్పడు రాష్ట్ర శాసన సభ సమావేశమునందున్నచో ఆ సమావేశంలో, అది సమావేశంలో లేనిచో తర్వాత సమావేశంలోను తెలంగాణ శాసనసభ సమక్షంలో మొత్తంలో 14 రోజుల వ్యవధి పాటు ఉంచాలి. ఈ వ్యవధి ఒకే సమావేశంలో గానీ, రెండు లేదా అంతకు మించిన వరుస సమావేశంలో చేరి ఉండవచ్చును. తరువాత తేదీ నిర్ణయిస్తే తప్ప తెలంగాణ శాసనసభ చెప్పిన వ్యవధిలో ఆ నియమం లో మార్పులు, రద్దు చేయుటకు అంగీకరించుటకు లోబడి అదికారిక గెజిట్‌లో వాటిని ప్రచురించు తేదీ నుంచి అమలు కలిగి ఉండును. అయినప్పటికి ఏదైనా మార్పు కానీ రద్దు కానీ ఆ నియమం కింద అంతకు ముందు చేయబడిన దేని చెల్లుబాటు కైనా ప్రతికూల భావన కలిగించరాదు.






