- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2029 ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌తో పొత్తు, రేవంత్-కేటీఆర్ బంధంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయని జరుగుతున్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు (BJP BRS Alliance) ఉండదని, లీడర్, క్యాడర్ లేని పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. కరప్షన్, అహంకారం, డ్రగ్స్ పార్టీతో మాకేంటి పొత్తు అని దుయ్యబట్టారు. ఇవాళ నిజామాబాద్‍లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇద్దరూ ఒక్కటేనని బీజేపీని దెబ్బతీసేందుకు ఈ ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‍కు (KCR) పదేళ్లు సీఎంగా అవకాశం ఇస్తే సెక్రటేరియట్ కు రాలేదు. ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇస్తే ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. అలాంటప్పుడు ఆయన పీకడానికి రాజకీయాలు చేస్తున్నారా? అంటూ పరుష పదజాలంతో విమర్శలు చేశారు. అలాంటి కేసీఆర్‍తో మాకు పొత్తు ఏంటన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఏం చేశారో ఆయన కూతురు కవితనే చెబుతున్నారు కదా అని ప్రశ్నించారు.
కవితకు రేవంత్ రెడ్డి ఫండింగ్:
కవిత పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. కులాల వారీగా హిందువులను విడదీసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొంగ పొత్తులతో బీజేపీని దెబ్బ తీయడానికి ప్రణాళికలు చేస్తున్నారన్నారు. ఇప్పుటి వరకు కేటీఆర్‍ను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి భారీగా వలసలు ఉండబోతున్నాయని జోస్యం చెప్పారు. ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దనే విషయంలో బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు.
బీజేపీలో గ్రూప్‍లు లేవు:
తెలంగాణ బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్ పై అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఎలాంటి గ్రూప్ లు లేవని, చిన్న చిన్న సమస్యలు అన్ని పార్టీల్లోనూ ఉంటాయన్నారు. రాకేశ్ రెడ్డితో నాకెలాంటి విభేదాలు లేవన్నారు. బీజేపీలో లేఖల అంశంపై స్పందిస్తూ.. నేను ఎలాంటి చిట్ చాట్ చేయను. నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయనన్నారు. అధిష్టానానికి ఎవరూ లేఖలు రాయలేదు.. ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. 2029లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. జీవన్‍రెడ్డి బీఆర్‍ఎస్ లో చేరే విషయంలో తొందరపడ్డారన్నారు.






