- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘త్వరలోనే బీజేపీలోకి హరీష్ రావు’.. బిగ్ బాంబ్ పేల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని బిగ్ బాంబ్ పేల్చారు. పొర్లు దండాలు పెట్టిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు ఇవ్వరని అన్నారు. ఇక, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్‌ను త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఇకనైనా చిల్లర మాటలు మానుకోవాలని చురకలంటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పార్టీ అవయవదానం చేసిందని విమర్శించారు.
కాగా, ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై విమర్శలు చేస్తోన్న వారికి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తోన్న వారికి లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. అయిలయ్య వ్యాఖ్యలపై హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ.






