- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగ్గులేకుండా ఆ మాట ఎలా చెప్పారు? కిషన్ రెడ్డిపై పరిపూర్ణనంద స్వామి ఫైర్
మిమ్మల్ని గెలిపించిన పాపానికి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమంటే తమ వద్ద ప్రణాళిక లేదని చెబుతారా అని కిషన్ రెడ్డిపై పరిపూర్ణనందాస్వామి మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ దేశంలో పులులు, జింకలు, కుక్కలకు ఉన్న విలువ గోమాతకు లేకుండా పాలకులు చేశారని పరిపూర్ణానంద స్వామి (Paripoornananda Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. లోక్ సభలో ఓ బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి సమాధానం ఇస్తూ తమ వద్ద గోమాత ను జాతీయ జంతువుగా ప్రకటించే ప్రణాళికలు ఏమీ కేంద్రం వద్ద లేదని చెప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లందరిని మనం ఓట్లు వేసి గెలిపించి దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టిన పాపానికి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి తమ వద్ద ప్రణాళిక లేదని చెప్పడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఏముందని నిలదీశారు. ఈ విషయం కేంద్రం పార్లమెంట్‍లో చెప్పడం అంటే సమాజం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. హిందువుల ఓట్లు అడుక్కోవడం కాదు.. హిందు ధర్మానికి హాని కలిగితే అండగా నిలబడాలన్నారు. ఈ విషయాన్ని హిందువులు కూడా ఆలోచించాలని చెప్పారు. జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్ ను గెలిపించాలని కోరారు.
బీఫ్‍కు జీఎస్టీ ఎత్తేసి ఆవు నెయ్యికి విధిస్తారా?
ఒక గుడి కట్టుకోవడం గొప్ప కాదని నిర్మించుకున్న గుడిని రేపు మరొకరు కొట్టేస్తారు. ఇదంతా నడుస్తూనే ఉంటాయి. కానీ బ్రతికున్న గోవులను గోవులను కాపాడుకునేందుకు చట్టం చేయలేకపోవడం ఏంటని మండిపడ్డారు. 100 కోట్ల హిందువుల అభిమానాన్ని పొందాలనుకుంటున్న వ్యక్తులు కోట్లాది గోవుల ప్రాణాలు నాశనం అవుతుంటే మా దగ్గర ఏ ప్లాన్ లేదని డిక్లేర్ చేశారంటే ప్రతి హిందువు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కిషన్ రెడ్డితో నాకు వ్యక్తిగా అభిమానం ఉంది. మేము వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు. అది వేరే విషయం. కానీ గో సంతతి నాశనం అవుతుంటే అది జరగకుండా కంకణం కట్టుకుని నిలబడాలో అలాంటి వారే సిగ్గులేకుండా మా దగ్గర ప్రణాళికలు ఏమి లేవని మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. బీఫ్‍కు జీఎస్టీ ఎత్తేసిన కేంద్రం ఆవు నెయ్యికి మాత్రం జీఎస్టీ విధించిందని మండిపడ్డారు. దేశంలో గోవధ జరుగుతుందంటే చట్టాలు చేయకపోవడం వల్లేనన్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా, వారు ఏ పార్టీవారైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెవలడం వల్ల ఆ పార్టీలకు వచ్చే అదనపు ఉపయోగం ఏమీ లేదన్నారు.






