- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
200 సార్లు ఫోన్ చేసినా రేవంత్ రెడ్డి తీయడం లేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నేను 200 సార్లు ఫోన్ చేసినా ఆయన తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎన్టీఆర్ కేబినెట్‍లోనే మంత్రిగా చేసిన తాను తన జాతి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్దామంటే తనకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం అడుగుదామని ప్రయత్నిస్తే అపాయింట్‍మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఐదెకరాల భూమి ఇస్తే మాదిగ భవనం నిర్మించుకుంటామన్నారు.
అక్కడికి నన్ను పిలవలే:
మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన కృతజ్ఞత కమిటీకి తనను పిలవలేదని మోత్కుపల్లి అన్నారు. ముఖ్యమంత్రి పిలవడం లేదు కాబట్టి నిర్వహాకులు కూడా తనను పిలవలేదేమో అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఎంత కాలం సీఎం పదవిలో ఉంటావో ఉండు నిన్ను మా భుజాన మోస్తామని చెప్పాను. అయినా ఏం పాపం చేశానో తెలియదు వందల సార్లు ఫోన్ చేసినా తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరం అన్నారు. మాదిగ కులాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్ లో మాదిగలు అడుగు పెట్టవద్దన్నట్లు టికెట్లు ఇవ్వలేదు. రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా సరైన అవకాశం ఇవ్వకుండా మాదిగలు చట్టసభల్లో అడుగే పెట్టవద్దన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వందల కార్పొరేషన్లు వేస్తే అందులో మాదిగలకు ఒక్కటే ఇచ్చారన్నారు. మా సమస్యలు పరిష్కరించకుండా మనం కలిసి ఉన్నాం కలిసి దావత్ లు చేసుకుందాం అంటే దానితో ఎవరికి సంతోషం అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై మాకు ఎలాంటి కోపం లేదని కానీ మా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
మాదిగ మహాశక్తి సంస్థ:






