- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM పదవి నుంచి తొలగిస్తే రేవంత్ చూస్తూ ఊరుకుంటాడా?.. బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
సీఎం రేవంత్‌రెడ్డి రోజు రోజుకూ దిగజారి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి రోజు రోజుకూ దిగజారి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. ఆయన అధికారం చేపట్టిన నాటి నుంచి చేసిన అభివృద్ది ఏమీ లేకపోవడంతో రాజకీయాలు పక్కదారి పట్టిస్తుండని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని, కాంగ్రెస్ప్రభుత్వం పరిపాలనలో విఫలమైందని దానికి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శమన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణకు ప్రధాని మోడీ ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేశారని, నా పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్‌కు రెండు వచ్చాయని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా తాను మాట్లాడానని, నవోదయాల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువగా చేరుతారని జిల్లా కేంద్రంలో పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. నిజామాబాద్‌లో ఇప్పటికే కొనసాగుతోందన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూమి ఇచ్చారని ఆ ల్యాండ్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌నేతలకు పని చేయడం చేతకాదని, చేస్తున్న వారిని చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే లెటర్ హెడ్ కూడా కొట్టించుకోవడం లేదని, మంత్రి పదవి ఇచ్చాకే లెటర్ హెడ్ సిద్ధం చేసుకుంటాడట ఆయనకు మతిస్థిమితం పెరిగిందన్నారు. తెల్ల బట్టలు వేసుకుని పోజులు కొట్టడం తప్ప ఏం చేయడం లేదన్నారు. పనికిమాలిన రాజకీయాలతో మంచి విద్య సంస్థలు రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ గల్లీ లీడర్‌లాగా సుదర్శన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇంకా బుద్ధిలేకుండా మంత్రి పదవి కావాలని కోరుతున్నారు. నయా పైసా పని చేయడు.. ముస్లింల ఓట్లతో గెలుస్తున్నాడని ఎద్దేవా చేశారు. మెదడు ఉన్న ఎవడైనా మోడీతో మంచిగా ఉంటాడు. ట్రంప్ లాంటి వ్యక్తే మోడీతో మంచిగా వ్యవహరిస్తున్నారని, కుర్చీలో దగ్గరుండి కూర్చోపెడుతున్నాడు.
రాహుల్ గ్రహాంతరవాసి సీఎం పదవి తొలగిస్తే రేవంత్ చూస్తూ ఊరుకుంటాడా? నిజంగా అదే జరిగితే వ్యక్తిగతంగా బీజేపీలోకి ఆహ్వానిస్తా. ఆయనను తీసుకుంటారా అనేది మాత్రం నా చేతిలో లేదన్నారు. కాంగ్రెస్ నేతలు, రేవంత్ కూడా నాకు మిత్రుడే ఫ్యూచర్ సిటీకి లోటస్ అని పేరు పెడతాడేమో అందుకే మోడీని మంచోడని పొగుడుతున్నారని పేర్కొన్నారు. అలా పెట్టుకుంటామంటే కచ్చితంగా అనుమతిస్తాం. పసుపు బోర్డు గురించి విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై స్పందించమని మా జిల్లా నేతలకు చెబుతా. అలాంటి ఔట్ డేటెడ్ లీడర్ల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరమన్నారు.






