- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో హంగ్..? ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఈ సారి హంగ్ రావచ్చని.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని ఈటల అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ ఈ సారి తెలంగాణలో 25 నుండి 30 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీ కింగ్ మేకర్ కాబోతుందన్నారు. కానీ బీజేపీ మాత్రం బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని ఈటల తేల్చి చెప్పారు. కాగా, తెలంగాణలో హంగ్ ఏర్పడవచ్చని ఈటల చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Next Story






