- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వదిలే ప్రసక్తే లేదు.. సీబీఐకి కంప్లైంట్ చేస్తా’: కవిత సంచలన ప్రకటన
బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణిలో అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి(Singareni)లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురబోతోందని జోస్యం చెప్పారు. అవినీతిని కట్టడి చేయకుంటే సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి కాంట్రాక్ట్‌లో 25 శాతం అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేశారు. దాంట్లో 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని అన్నారు. సింగరేణిలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం.. అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, సీఎంలను డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తామే సీబీఐ(CBI)కి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ప్రకటన చేశారు.
త్వరలోనే జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికుల విశ్వాసం పొంది హెచ్ఎంఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్‌లో గౌరవాధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నారు.. మీరిచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మికుల బాగు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ‘టీబీజీకేఎస్ అనేది మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదు. గుర్తింపు సంఘం అనుకుంటున్న వాళ్లు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు.. నిజానికి సింగరేణి ఎన్నికల్లో వాళ్లకు గెలిచే అంతా సీన్ లేదు. అప్పుడు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కారణంగా ఆ పరిస్థితి వచ్చింది. సింగరేణిలో ఇప్పుడున్న ఎర్రజెండా కాకుండా మరొక జెండా ముందుకు రాబోతోంది. హెచ్ఎంఎస్, జాగృతి సంస్థలు మొత్తం 40 వేల మంది సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తాయి. సింగరేణిలో పనిచేయడమంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వారికి పూర్తి స్థాయిలో భద్రత ఉండదు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ను మనుషులే కాదన్నట్లుగా చూస్తున్నారు. అలాంటి వారికి మేము అండగా ఉంటామని కవిత భరోసా ఇచ్చారు.






