- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాగంటి గోపినాథ్ భార్య సునీత కాదు.. ఆమె నామినేషన్ రద్దు చేయండి : ప్రద్యుమ్న
జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సెన్సేషనల్ ఆరోపణలు నమోదయ్యాయి. మాగంటి గోపినాథ్ తన భార్య మాలినీదేవికి విడాకులు ఇవ్వలేదని, ఇప్పటికీ మా అమ్మ మాగంటి గోపినాథ్ భార్యనేనని, అలాంటపుడు సునీత భార్య ఎలా అవుతుందని గోపినాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న ప్రశ్నించాడు. తన తండ్రి సునీతను పెళ్లి చేసుకోలేదని, కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనే ఉన్నారని, తన తండ్రికి అసలైన వారసుడిని తానేనని అన్నారు.
న్యాయబద్దంగా ఎమ్మెల్యే టిక్కెట్టు తన తల్లికి రావాలని, సునీత తన అనుచరులతో తమని బెదిరించారని, వెంటనే ఆమె నామినేషన్ రద్దు చేయాలని ప్రద్యుమ్న డిమాండ్ చేశాడు. అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణించడంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు ఏర్పడ్డాయి. నిన్నటితో నామినేషన్ ప్రక్రియ కూడా ముగియగా... నేడు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఈ ఆరోపణలు రావడం రాజకీయాల్లో కలకలం రేగింది. అయితే ఈ ఆరోపణలపై సునీత స్పందించాల్సి ఉంది.






