రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఓటరు లిస్ట్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఓటరు లిస్ట్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వేములవాడ (Vemulawada) నియోజకవర్గ ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ (Chennamaneni Ramesh) పేరును అధికారులు తొలగించారు. ఈ మేరకు ఆయన నివాసం ఎదుట నోటీసులు కూడా అంటించారు. కాగా, ప్రభుత్వ విప్, వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇటీవలే తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని.. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పేరును ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆది శ్రీనివాస్ అధికారులను కోరారు. దీంతో ఆయన పేరును ఓటరు లిస్ట్ నుంచి తొలగిస్తూ.. ఆయన ఇంటి ఎదుట అధికారులు నోటీసులు అంటించారు. కానీ, ఇప్పటి వరకు ఆ నోటీసులపై ఎలాంటి సమాధానం రాలేదు. అయితే, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ వ్యక్తిని ఏకంగా ఓటరు జాబితా నుంచి తొలగించడం దేశం‌లోనే తొలిసారి అంటూ రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది.

Next Story