- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సెన్సేషన్.. స్పీకర్‌పై BRS కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ (BRS) దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)ను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ (BRS) దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)ను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ధర్మాసనం విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ 31న ముగియడంతో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌కు పోటీగా బీఆర్ఎస్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారని.. స్పీకర్ అర్థం లేని విచారణతో కాలయాపన చేస్తున్నారంటూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో నోటిఫై కావాల్సి ఉంది. అక్కడ వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం మరో రెండు, మూడు రోజుల్లో కంటెప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ ధర్మాసనం ఎదుటకు విచారణకు వచ్చే అవకాశం ఉంది.






