- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hanumantha Rao : కో-లివింగ్ కల్చర్ పై సీనియర్ నేత హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు(Hanumantha Rao) హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో కో-లివింగ్(Co-Living) స్పేస్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు(Hanumantha Rao) హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో కో-లివింగ్(Co-Living) స్పేస్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు హనుమంతరావు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. వీటిని నియంత్రించాలని సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy), మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును(Minister Sridhar Babu) కోరారు. ఒకే హాస్టల్‌లో యువతీ యువకులు కలిసి ఉండటం సమాజంలో అనైతిక ప్రవర్తనకు దారితీస్తోందని హెచ్చరించారు. హైదరాబాద్‌ను నెంబర్ వన్ సిటీగా నిలబెట్టాలంటే ఇటువంటి ప్రవృత్తిని కట్టడి చేయాలని, ఇలాంటి వ్యవహారాలపై NSUI విద్యార్థి సంఘం దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉండగా, ఇప్పుడు లవ్ మర్డర్స్ పెరిగాయని అన్నారు.
సొంత భర్తను, తల్లిని కూతురు చంపడం వంటి దారుణ ఘటనలు సమాజం దిగజారుతున్న దిశను సూచిస్తున్నాయని, ఇటువంటి హత్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని కోరారు. హ్యూమన్ రైట్స్ సంస్థలు నక్సలైట్ హత్యలపై మాట్లాడుతాయని, కానీ లవ్ మర్డర్స్‌పై మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ వీటిని కూడా తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. సైకాలజిస్ట్‌లు, మేధావులు ఈ సమస్యలపై ఆలోచించి పరిష్కారాలు సూచించాలని, సమాజంలో ఎక్కడో తప్పు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, మహిళలందరూ సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె స్త్రీ విద్య, సామాజిక సంస్కరణల కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.






